Begin typing your search above and press return to search.

లొకేష‌న్‌ లో మ‌మ్మీ ఎందుకు?

By:  Tupaki Desk   |   24 Nov 2018 1:30 AM GMT
లొకేష‌న్‌ లో మ‌మ్మీ ఎందుకు?
X
ఆన్ లొకేష‌న్ మ‌మ్మీ ఎందుకు? కూతురి వెంటే ఉండ‌క‌పోతే ఇబ్బంది ఏంటట‌? ఆ ఒక్క‌టీ అడ‌క్కు ప్లీజ్! అంటారా? అలా అంటే కుద‌ర‌దు. కార‌ణ‌మేంటో తెలిసి తీరాలి. కొంద‌రు క‌థానాయిక‌లు ఆన్ లొకేష‌న్ ఉండ‌గా త‌మ వెంటే మమ్మీ కూడా ఉండాల‌ని ష‌ర‌తులు పెట్ట‌డం ఫిలింన‌గ‌ర్‌ లో మ‌రోసారి చ‌ర్చ‌కొచ్చింది. అయితే ఇప్పుడున్న సీనియ‌ర్ నాయిక‌ల్లో చాలా మంది మ‌మ్మీని వెంట పెట్టుకొచ్చే అల‌వాటు వ‌దిలేశారు. వీళ్లంతా కెరీర్ ఆరంభం ప‌క్క‌నే మ‌మ్మీ ఉండాల‌ని మారాం చేసేవారు. మ‌మ్మీస్‌ కి త‌మ‌తో స‌మానంగా ఫెసిలిటీస్ ఇవ్వాల‌ని కోరేవారు. స‌ద‌రు క‌థానాయిక‌ల‌తో పాటు ప్ర‌తి లొకేష‌న్‌ కి ప్ర‌యాణం ఖ‌ర్చులు - మెయింటెనెన్సులు వ‌గైరా త‌ప్ప‌నిస‌రిగా డిమాండ్ ఉండేది. కానీ కాల‌క్ర‌మంలో రాను రాను ఆ అల‌వాటులో మార్పు వ‌చ్చింది.

త‌మ‌న్నా - త్రిష‌ - కాజ‌ల్ - నిత్యా లాంటి నాయిక‌లు కెరీర్ ఆరంభం త‌మ వెంట మ‌మ్మీల‌ను తెచ్చుకున్నా -కొంత అనుభ‌వం వ‌చ్చాక‌.. ప‌రిచ‌యాలు- స్నేహాలు పెరిగాక ఆ త‌ర్వాత అల‌వాటు మానుకున్నారు. రేర్‌ గా మాత్ర‌మే మ‌మ్మీస్‌ ని వెంట పెట్టుకెళుతుంటారు. నేటిత‌రం నాయిక‌ల్లో రాశీఖ‌న్నా - రెజీన - కీర్తి సురేష్‌ లాంటి ముద్దుగుమ్మ‌లు మ‌మ్మీ లేకుండానే లొకేష‌న్‌ కి వెళుతుంటారు.

మొన్న‌టికి మొన్న బూరె బుగ్గ‌ల పూర్ణ మాత్రం త‌న వెంటే మమ్మీని తెచ్చుకుంది. రామానాయుడు స్టూడియోస్‌ లో కొత్త సినిమా ప్రారంభోత్స‌వం ఆద్యంతం త‌న‌తో పాటే మ‌మ్మీ కూడా వేచి చూడ‌డం మీడియా కంట ప‌డింది. అయితే పూర్ణ సీనియ‌ర్ నాయిక‌. ఇప్పుడే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌లేదు. కానీ మ‌మ్మీ త‌న‌కు తోడుగా ఎందుకొచ్చారో అంటూ మాటా మంతీ సాగింది. అయితే ఇటీవ‌ల మీటూ ఉద్య‌మం నేప‌థ్యంలో నాయిక‌లు కాస్తంత అప్ర‌మ‌త్తంగానే ఉంటున్నారు. త‌మ‌పై లేనిపోని నింద‌లు అవ‌స‌రం లేద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే ఇప్పుడిలా మ‌ళ్లీ మ‌మ్మీస్‌ ని వెంట తెచ్చుకుని జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. మామ్ ఉంటే నింద‌లు వేయ‌డం క‌ష్టం అంటూ మాట్లాడుకోవ‌డం విశేషం.