Begin typing your search above and press return to search.
మహేష్‌ని చూసి మనసు పారేసుకున్నా
By: Tupaki Desk | 17 March 2015 5:23 AM GMTమల్లూవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్‌లో పాగా వేసింది బొద్దుగుమ్మ పూర్ణ. అచ్చు గుద్దినట్టు అశిన్ పోలికలు .. ఈ అమ్మడికి పెద్ద అస్సెట్. ఈ భామను జూనియర్ అశిన్ అని పిలుస్తారంతా. ఆ కళ్లు, ముకుతీరు, బౌండరీ చూడడానికి అచ్చం అశిన్‌లానే ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ రవిబాబు కొలువులోని థ్రిల్లర్ సినిమాల్లో నటిస్తోంది. తొలిగా అవును చిత్రంలో దెయ్యం పట్టే గృహిణి పాత్రలో నటించి ఆకట్టుకుంది.
అద్భుతమైన అభినయం, డ్యాన్స్ పూర్ణకి పెట్టని ఆభరణాలు. అవును ఘనవిజయం సాధించడంలో పూర్ణ అభినివేశానిదే పెద్ద పాత్ర. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌లోనూ నాయికగా నటిస్తోంది. అన్నట్టు ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ గురించి ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పింది. నేను మలయాళీ ముద్దుగుమ్మను. ప్రారంభం టాలీవుడ్‌లో అడుగుపెట్టేప్పటికి ఇక్కడి హీరోలెవరూ తెలీదు. నాగార్జున, వెంకటేష్ ఈ ఇద్దరే తెలుసు. కాలక్రమంలో మహేష్, ఎన్టీఆర్ ఇద్దరి ఫోటోలు చూశాను. వాటిలో మహేష్ నన్ను విపరీతంగా ఆకర్షించాడు. అతడితో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా.. అని చెప్పింది. అసలింతకీ ఈ విషయం ఎందుకు చెప్పిందంటే.. ఇటీవలే ఈ భామ శ్రీమంతుడు చిత్రంలో ఓ ఐటెమ్‌నంబర్‌లో నర్తించింది.
ఆ సందర్భంలో ప్రిన్స్‌తో తన అనుభవాన్ని చెబుతూ.. ''మహేష్ సినిమాలో నర్తించే అవకాశం రావడం నా అదృష్టం. ఆన్‌సెట్స్ తనతో చనువుగా మాట్లాడాలంటే సిగ్గేసేది. అయినా చివరిరోజు డేర్ చేసి ప్రిన్స్‌తో మాట్లాడేశా. మై వర్క్ ఈజ్ ఓవర్ అని చెప్పాను. వెంటనే ఆల్ ది బెస్ట్ అనేశారు.. అంటూ మురిసిపోయింది. పాపం మహేష్ తన పక్కనే ఓ ఛాన్సిస్తే బావుణ్ణు కదా!!