Begin typing your search above and press return to search.
పూర్ణ బ్యాక్ టు ఫామ్!!
By: Tupaki Desk | 16 Sep 2018 7:54 AM GMTతెలుగులో అవును సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ఎక్కువ కాలం ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది. అడపాదడపా హిట్లు వచ్చినా అవన్నీ చిన్న సినిమాలు కావడంతో ఇక్కడ లాభం లేదని కోలీవుడ్ లో సెటిలయ్యే ప్రయత్నం గట్టిగా చేసింది. అక్కడా హీరోయిన్ వేషాలు అంతంతమాత్రంగానే ఉండటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రకైనా రెడీ అంటోంది. గత ఏడాది శశికుమార్ హీరోగా రూపొందిన కోడివీరన్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకోసం ఏకంగా గుండు కొట్టించుకోవడానికి కూడా వెనుకాడలేదీ బ్యూటీ. అంత చేసినా అది పరాజయం పాలవడం పూర్ణను బాగా నిరాశ పరిచింది. ఇటీవలే సిల్లీ ఫెలోస్ లో సునీల్ సరసన అతని మరదలిగా చిన్న క్యామియోలో మెరిసిన పూర్ణ త్వరలో విడుదల కానున్న అదిగో సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
రవిబాబు దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మాతగా రూపొందుతున్న అదుగోలో పూర్ణ టైటిల్ సాంగ్ లో కనిపిస్తుందట. ఆ ట్రాక్ రేపు విడుదల చేయబోతున్నారు. రవిబాబు అవునుతోనే పూర్ణకు బ్రేక్ వచ్చింది కాబట్టి ఆ అభిమానంతో ఒప్పుకున్నట్టు సమాచారం. భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారి ఓ పంది పిల్లను గ్రాఫిక్స్ ద్వారా పునఃసృష్టి చేసి దాని చుట్టే కథ మొత్తం నడిపిన సినిమాగా అదుగో మీద ప్రేక్షకుల్లో మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన దక్కించుకుంది. అధిక శాతం గ్రాఫిక్స్ వర్క్ ఉన్న అదుగో షూటింగ్ సుమారుగా మూడేళ్ళ నుంచి సాగుతోంది. సీజే లేట్ కావడంతో ఎట్టకేలకు వాటిని కోరుకున్న క్వాలిటీలో పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్నాడు రవిబాబు. అందులో భాగంగా పూర్ణ సాంగ్ చాలా స్పెషల్ గా ఉండబోతోందని టాక్. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన హెయిర్ స్టైల్ తో స్టిల్స్ ఇచ్చిన పూర్ణను చూస్తుంటే అవకాశాలు ఇవ్వాలే కానీ మళ్ళి ప్రూవ్ చేసుకునేలా ఉంది.