Begin typing your search above and press return to search.

సూర్యతో అవును అమ్మాయి

By:  Tupaki Desk   |   23 Feb 2019 5:45 AM GMT
సూర్యతో అవును అమ్మాయి
X
పేరుకు తెలుగు అమ్మాయే అయినా కోలీవుడ్ లో బాగా సెటిలైపోయిన పూర్ణ ఇక్కడ అవును లాంటి సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది కాని ఆశించిన స్థాయిలో రాణించలేకపోయంది. సీమ శాస్త్రి లాంటి ఒకటి రెండు హిట్స్ తప్ప చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు మాత్రం దక్కలేదు. శ్రీమంతుడులో మహేష్ బాబు సరసన ఒక్క పాటలో డాన్స్ చేసిన ఆనందం తప్ప పూర్ణకు టాలీవుడ్ లో దక్కింది తక్కువే. తమిళ్ లో మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలతో బాగానే వర్క్ అవుట్ చేసుకుంటున్న పూర్ణకు ఇప్పుడు సూర్యతో నటించే ఛాన్స్ దక్కింది.

సౌత్ లో వన్ అఫ్ ది మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న కాప్పన్(తెలుగు టైటిల్ ఇంకా ధృవీకరించలేదు)లో పూర్ణకు ఓ కీలకమైన పాత్ర చేసే అవకాశం వచ్చింది. షూటింగ్ లో పాల్గొనడం మొదలైంది. మొదటిసారి సూర్యతో నటించడం పట్ల పూర్ణ బాగా ఎగ్జైట్ అవుతోంది. ప్రధాన మంత్రికి సెక్యూరిటీ ఆఫీసర్ గా నటిస్తున్న సూర్యకు సాయేషా సైగల్ జోడిగా నటిస్తోంది

మోహన్ లాల్ ప్రైమ్ మినిస్టర్ గా ఆర్య మెయిన్ విలన్ గా నటిస్తున్న కాప్పన్ ఆగస్ట్ లో విడుదల కానుంది. ఏప్రిల్ లో నంద గోపాల కుమరన్ ప్లాన్ చేసిన నేపధ్యంలో దీన్ని ఇండిపెండెన్స్ డే కి షిఫ్ట్ చేసారు. సాహోతో పోటీ పడుతుంది కాబట్టి ఇంకా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లైకా సంస్థ వంద కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తోంది. కొత్త మేకోవర్ తో సూర్య చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే పూర్ణకు లక్ తిరిగినట్టే. సూర్యతో పూర్ణకు ఏమైనా లవ్ ట్రాక్ లేదా పాట లాంటిది ఉంటుందా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు