Begin typing your search above and press return to search.
ప్చ్.. పూర్ణ.. లక్ కలసి రాలేదు
By: Tupaki Desk | 17 Aug 2015 10:54 PM GMTసీమటపాకాయ్ సినిమాతో పూర్ణ పేరు పాపులర్ అయిపోయింది. జూనియర్ అశిన్ లా ఉందే అంటూ పొగిడేశారంతా. ఆకాశంలో ఒక తార నా కోసమొచ్చింది ఈ వేళ అంటూ అల్లరోడు పూర్ణ తో కలిసి సాంగేసుకున్న తర్వాత ఈ బొద్దుగుమ్మ ఎవరో బాగుందే అన్న టాక్ వచ్చింది. ఆ తర్వాత అల్లరి రవిబాబు అవును, అవును 2లో పూర్ణనే నాయికగా తీసుకుని మరింత పాపులర్ చేశాడు.
ఈ సినిమాల గుర్తింపుతోనే ఇప్పటికీ పూర్ణ అనే నాయిక ఉందని తెలుగు జనాలు గుర్తు పెట్టుకున్నారు. అయితే ఇంత చేసినా ఇంకా బి-గ్రేడ్ లోనే ఉండిపోవాల్సొచ్చిందని భావించిందో ఏమో? ఏకంగా సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు లో ఓ పాటలో అతిధిలా తళుక్కున మెరిసి మురిపించింది. అయినా ఏం లాభం? అసలు పూర్ణ ఎప్పుడొచ్చింది? ఎప్పుడెళ్లి పోయిందో కూడా ఎవరూ గుర్తించలేదు. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచిన చందంగా అసలు పూర్ణ కు ఈ సినిమా ఏమాత్రం ప్లస్ అవ్వలేదు.
సూపర్ స్టార్ సినిమాలో నేనూ ఒక భాగం అని చెప్పుకోవడానికి తప్ప వేరే దేనికీ ఈ స్పెషల్ అప్పియరెన్స్ ఉపయోగపడలేదు. శ్రీమంతుడు క్రేజు తో తనని వెతుక్కుంటూ ఇంతవరకూ ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ప్ఛ్ .. సో శాడ్ బేబి.. లక్ కలసిరాలేదు నీకు..