Begin typing your search above and press return to search.
అట్టాంటివి ఇక చేయను బాబోయ్
By: Tupaki Desk | 11 July 2017 5:30 PM GMTమన దేశంలో సినిమాలు తీసేవాళ్ళకి.. ఓ అలవాటు ఉంది. ఒక సినిమా హిట్ అయితే అలాంటి సినిమాలే.. వరసపెట్టి తీసేస్తూ ఉంటారు. ఒక రోల్ హిట్ అయితే ఆ నటుడు/నటికి అలాంటి పాత్రలే ఇస్తుంటారు. ఉదాహరణకు లావణ్య త్రిపాఠి మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ సినిమాలో ఒక సాధారణ అమ్మాయిలా కనిపించింది. దాంతో ఆమెకు అన్నీ సినిమాలలో అలానే చూపించడానికి డైరెక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు. అలానే వదిన కేరక్టర్ చేస్తే వదిన.. అక్క చేస్తే అక్క.. ఐటెమ్ సాంగ్ చేస్తే ఇంకా ఐటెమ్ సాంగ్సకే వాళ్ళని పరిమతం చేస్తుంటారు. మలయాళం సుందరి పూర్ణ పరిస్థితి ఇలానే ఉంది.
రవి బాబు డైరెక్ట్ చేసిన ‘అవును’ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ ఆ తరువాత తెలుగు తమిళ్లో కొన్ని సినిమాలు చేసినా.. అవన్నీ హారర్ సినిమాలే. ఆమెను అందరూ ఇప్పుడు హారర్ హీరోయిన్ గానే గుర్తిస్తున్నారు. పూర్ణ ‘కాలింగ్ బెల్’ - ‘రాజు గారి గది’ - ‘అవును2’ - ‘అవంతిక’ లాంటి హారర్ డ్రామాల్లో నటించింది. ఇప్పుడు మళ్ళీ ఆమె నటించిన ‘రాక్షసి’ కూడా అటువంటిదే. ఇలా వరస పెట్టి హారర్ సినిమాలే చేయడంతో పూర్ణ బాగా విసుగొచ్చినట్లుగా ఉంది. ”హారర్ సినిమాల్లో నటించడం ఇక నా వాల్ల కాదు. అన్నీ ఒకే టైపు ఛాన్స్ లు వస్తున్నాయి. ఇలాంటి కథతో వస్తున్న సినిమా ఇంకోటి ఉంది. ఆ సినిమా పూర్తికాగానే ఇక హారర్ సినిమాల్లో నటించడం ఆపేస్తాను. నాకు నటిగా పలు రకాల పాత్రలలో కనిపించాలి అని ఉంది. కొత్త కొత్త కథల్లో నటించాలని ఉంది” అంటూ తెగేసి చెప్పింది పూర్ణ.
ప్రస్తుతం ఆమె తమిళ సినిమాలు చూసుకుంటే.. ‘శవరకత్తి’ సినిమాలో ఆమె ఒక చెవిటి గర్భిణీ పాత్రలో కనిపించబోతుంది. అలాగే ‘కోడి వీరన్’ సినిమాలో గుండు కొట్టించుకుని మరీ నెగిటివ్ రోల్ చేస్తుంది. ఈ రెండు సినిమాలు తర్వాతైనా.. ఈమెకు టాలీవుడ్ లో మరిన్ని కొత్త తరహా పాత్రల ఆఫర్స్ వస్తాయేమో చూద్దాం.