Begin typing your search above and press return to search.
అల్లరోడి హీరోయిన్ ప్రూవ్ చేసుకుంటుందా?
By: Tupaki Desk | 17 Dec 2015 11:27 AM GMTహీరోయిన్ పూర్ణ.. కెరీర్ లో బిగ్ బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ భామ "మామ మంచు.. అల్లుడు కంచు" మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిస్ మస్ సందర్భంగా ఈ నెల25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవ్వాలని పూర్ణ కోరుకుంటోంది. "మామ మంచు.. అల్లుడు కంచు" చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటిస్తుండగా.. పూర్ణ కేరక్టర్ గ్లామరస్ రోల్ కాదు. ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువతి పాత్రను చేస్తోంది.
కేరక్టర్ పరంగా గ్లామర్ కి స్కోప్ లేకపోయినా.. అల్లరి నరేష్ కి పోటీ ఇచ్చేలా కామెడీ చేశానంటోంది. అంతే కాదు.. మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు సూపర్ గా ఉంటాయట కూడా. గతంలోనూ అల్లరి నరేష్ తో రెండు సినిమాలు చేసిన పూర్ణకు టాలీవుడ్ లో మంచి హిట్ మాత్రం రాలేదు. అయితే.. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు తనను లీడింగ్ హీరోయిన్ ని చేస్తాయని పూర్ణ అంటోంది. శివాజీ డైరెక్షన్ లో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం "సర్వ మంగళం"లోనూ పూర్ణ హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో అమ్మడిది గ్రామీణ యువతి పార్త. తమిళనాట కూడా ఓ మంచి ప్రాజెక్ట్ లో భాగమైంది ఈ భామ. "సవరక్కత్తి" పేరుతో తెరకెక్కునున్న చిత్రంలో... అప్పటికే ఇద్దరు పిల్లలు, చెవుడుతో బాధపడే 9 నెలల గర్భవతిగా చేస్తోంది పూర్ణ.