Begin typing your search above and press return to search.

ఓటీటీల‌పై పాపుల‌ర్ న‌టుడి డ‌బుల్ స్టాండార్డ్

By:  Tupaki Desk   |   22 Nov 2021 5:29 AM GMT
ఓటీటీల‌పై పాపుల‌ర్ న‌టుడి డ‌బుల్ స్టాండార్డ్
X
బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దిన్ సిద్ధీఖి ఇటీవ‌ల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఓటీటీ అనేది పెద్ద దందా వ్య‌వ‌స్థ అని..ఎట్టి ప‌రిస్థితుల్లో అలాంటి మోస‌పూరిత‌ ఓటీటీ కంటెంట్ లో న‌టించ‌న‌ని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల్ని ఆయ‌న వెన‌క్కి తీసుకున్నారు. పైపెచ్చు ఓటీటీ నే గొప్ప అంటూ చెప్పుకు రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ``చాలా సినిమాల్లో న‌టిస్తున్నాను.

అవ‌న్నీ ఎక్కువ‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. న‌టుడిగా నాకు వ‌ర‌ల్డ్ వైడ్ గుర్తింపు ద‌క్కిందంటే దానికి కార‌ణం ఓటీటీనే. నెట్ ప్లిక్స్ పై నాకెంతో గౌర‌వం ఉంది. ఈరోజు ఇలా ఉన్నానంటే కార‌ణం నెట్ ప్లిక్స్ నే. నా ట్యాలెంట్ అంద‌రికీ తెలిసిందంటే కార‌ణం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ఓటీటీ లే కార‌ణం. డిజిట‌ల్ ప్లాట్ పామ్స్ పై న‌టించ‌న‌ని ఎప్పుడూ చెప్ప‌లేదు. బ‌హుశా నా మాట‌ల్ని త‌ప్పుగా అర్ధం చేసుకుని ఉండొచ్చు. లేదా త‌ప్పుగా ప్ర‌చారం జ‌రిగి ఉండొచ్చు. ఈరోజు సినిమా ని బ్ర‌తికిస్తుంది ఓటీటీనే. భ‌విష‌త్య్ కూడా ఓటీటీదే. అలాంటి ఓటీటీపై నెగిటివ్ గా నేనెందుకు వ్య‌తిరేకంగా మాట్లాడుతానా`` అంటూ ప్లేట్ ఫిరాయించారు.

`నేను న‌టించ‌డానికి మాత్ర‌మే పుట్టాను. ఏ సినిమా షూటింగ్ మొద‌లైనా ఆ క్ష‌ణం నుంచి నా పాత్ర‌లోకి లీన‌మైపోతాన`ని అన్నారు. మ‌రి అప్పుడు అలా ఎంద‌కు మాట్లాడారు? ఇప్పుడు ఎందుకు ప్లేట్ ఫిరాయించారు? అంటూ ఓటీటీ సానుభూతిప‌రుల్లో చ‌ర్చ సాగుతోంది. క‌రోనా రాక‌తో ఓటీటీ వ్య‌వ‌స్థ ఎంత‌గా పాపుల‌ర్ అయిందో తెలిసిందే. ఏడాదిన్న‌ర‌కు పైగా ప్రేక్ష‌కుల ఎంట‌ర్ టైన్ మెంట్ అంతా ఓటీటీలోనే. భ‌విష్య‌త్ సినిమా కూడా ఓటీటీదే. ఇప్ప‌టికే థియేట‌ర్ వ్య‌వ‌స్థ క‌నుమ‌రుగైపోతుంది. ఉన్న థియేట‌ర్లు ఫంక్ష‌న్ హాల్స్ గా..షాపింగ్ కాంప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.

స్మార్ట్ యుగంలోకి వ‌చ్చేసాం. జీవ‌న విధానంలో ఎన్నో మార్పులు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే క్ష‌ణాల్లో ప‌నులు జ‌రిగిపోతున్నాయి. ఇల్లు క‌దిలే ప‌నిలేదు. ఫోన్..ల్యాప్ టాప్ ల్లోనే ప‌నులు జ‌రిగిపోతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఓటీటీ కి ఎంత ప్రాధాన్య‌త ఉందో అర్ధ‌మ‌వుతోంది. అందుకే ఇప్పుడు మ‌ళ్లీ న‌వాజుద్దీన్ మాట మార్చార‌ని గుస‌గుస వినిపిస్తోంది.