Begin typing your search above and press return to search.
`అవతార్` నే వదులుకున్నాడట!
By: Tupaki Desk | 30 July 2019 8:21 AM GMTసైన్స్ ఫిక్షన్ సినిమాల స్పెషలిస్ట్.. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన `అవతార్` సెన్సేషన్స్ ఎప్పటికీ హాట్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా 20 వేల కోట్ల వసూళ్లతో `అవతార్` సంచలనం సృష్టించింది. ఈ సిరీస్ నుంచి సీక్వెల్ సినిమా 2021లో రిలీజ్ కానుంది. అయితే ఇలాంటి సెన్సేషనల్ మూవీలో నటించే అవకాశం వస్తే ఏ హీరో అయినా వదులుకుంటారా? కానీ ఆ ఆఫర్ ను తాను తృణప్రాయంగా వదులుకున్నానని చెప్పి షాకిచ్చారు బాలీవుడ్ హీరో గోవిందా.
`అవతార్` చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాల్సిందిగా కామెరూన్ తనకి ఛాన్సిచ్చారట. అయితే కండిషన్స్ అప్లయ్ అని అనడంతో ఆలోచించాల్సి వచ్చింది. ఆ కండీషన్ ఏమిటి? అంటే.. దాదాపు 410 రోజుల సమయం ఈ సినిమా కోసం కేటాయించాల్సి ఉంటుందని .. పైగా అన్ని రోజులూ బ్లూ కలర్ బాడీ పెయింటింగ్ తో అలానే ఉండిపోవాలని చెప్పారట. ఆ దెబ్బకు నా వల్ల కాదు బాబోయ్ అని కామెరూన్ కి చెప్పేశాడట. ఆ అవకాశాన్ని వదులుకుంటున్నందుకు ఎంతో వినయంగా క్షమాపణలు కోరాడట. అంతేనా అసలు ఆ సినిమాకి `అవతార్` అనే టైటిల్ బావుంటుందని తానే సూచించానని గోవిందా తెలిపారు.
ఇటీవలే గోవిందా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ సంగతులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒక భారతీయ నటుడిని ఆస్కార్ గ్రహీత జేమ్స్ కామెరూన్ వెతుక్కుంటూ రావడం.. రికార్డ్ బ్రేకింగ్ బడ్జెట్ సినిమాలో అవకాశం ఇవ్వడమే గొప్ప అనుకుంటే దానిని తన సుఖం సౌకర్యం కోసం వదులుకోవడం అంటే చాలా మందికి షాకింగ్ గానే ఉంది. వరల్డ్ నంబర్ -1 వసూళ్ల చిత్రంగా `అవతార్` రికార్డులు నిన్నటివరకూ పదిలంగా రికార్డుల్లో ఉన్నాయి. ఈ సినిమా రికార్డుని అధిగమించేందుకు పదేళ్లు వేచి చూడాల్సొచ్చింది. ఇటీవలే రిలీజైన `అవెంజర్స్-ఎండ్ గేమ్` `అవతార్` రికార్డును బ్రేక్ చేసి నంబర్-1 వసూళ్ల చిత్రంగా రికార్డులకెక్కింది. అలాంటి గ్రేట్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకోవడం ఏమిటో..!