Begin typing your search above and press return to search.

ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి!

By:  Tupaki Desk   |   18 Jun 2020 9:38 AM GMT
ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి!
X
తెలుగులో సెన్సేషనల్ హిట్ మూవీ 'దేవీ' గురించి ప్రస్తావిస్తే మొదటగా గుర్తొచ్చేది ఆ సినిమాలోని దేవి పాత్ర పోషించిన బాలనటి వనిత విజయ్ కుమార్. వనిత అలనాటి నటి మంజుల కూతురు. మంజుల తమిళ నటుడు విజయ్ కుమార్‌ భార్య అని అందరికి తెలిసిందే. అయితే వీరికి ముగ్గురు కూతుళ్లు. అందులో పెద్ద కూతురు వనిత. వనిత తమిళ ఇండస్ట్రీలో టీవీ నటిగా.. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం వనిత పెళ్లి వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పెళ్లి వార్త హల్చల్ చేయడం ఏంటని అనుకోకండి.. ఇది వనితకు ముచ్చటగా మూడో పెళ్లి. తెలుగులో కోడి రామకృష్ణ విసువల్ వండర్ 'దేవి' సినిమాలో నటించిన వనిత.. 2000లో యాక్టర్ ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు. ఇక 2005లో ఆకాశ్ తో మనస్పర్థలు ఏర్పడి విడిపోయింది.

ఆ తరువాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక కూతురు. ఇక 2012లో అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది వనిత. ఆ తర్వాత 2012 నుండి డాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో వనిత సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పీటర్ పాల్‌ అనే వ్యక్తితో మూడో పెళ్లికి సిద్ధమవుతోంది. పీటర్.. బాలీవుడ్.. కోలీవుడ్.. హాలీవుడ్ ఇండస్ట్రీలలో పలు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పని చేసిన పీటర్ పాల్ అనే వ్యక్తితో పెళ్ళికి సిద్దమైంది. ఈ నెల 27న వీరి పెళ్లి కూడా జరుగనుందని సమాచారం. ఈ వార్త ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో జోరుగా హల్చల్ చేస్తోంది. అయితే ఈ వార్త పై అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. వనిత.. తెలుగు సినీ ప్రేక్షకులకు బాలనటిగా దేవి సినిమాతో సుపరిచితం అయింది. ఆ సినిమాలో వనిత ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఎందుకో గాని ఆ సినిమా తర్వాత వనిత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్న వనిత ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అవుతుండటం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.