Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ కు షాక్‌ ఇచ్చిన హ్యాకర్స్‌

By:  Tupaki Desk   |   3 Dec 2020 8:59 AM GMT
స్టార్‌ హీరోయిన్‌ కు షాక్‌ ఇచ్చిన హ్యాకర్స్‌
X
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి. ఆమె తన అకౌంట్స్‌ ను యాక్సెస్‌ చేయలేక పోతున్నట్లుగా పేర్కొంది. గుర్తు తెలియని వారు తన అకౌంట్‌ ను హ్యాక్‌ చేసినట్లుగా అనుమానంగా ఉంది. ప్రస్తుతం నేను కూడా నా అకౌంట్‌ లను తెరవలేక పోతున్నాను. అందుకే కొన్ని రోజుల పాటు నా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ లో ఏమైనా పోస్ట్‌ అయితే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రెస్‌ నోట్‌ లో పేర్కొంది. ఆమె అకౌంట్‌ హ్యాక్‌ అవ్వడం వెనుక ఎవరైన ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్‌ మరియు ఇన్‌ స్టాగ్రామ్‌ రెండు కూడా హ్యాక్‌ అయినట్లుగా వరలక్ష్మి పేర్కొంది. తన అకౌంట్‌ లను రికవరీ చేసుకున్న తర్వాత మళ్లీ మీకు సమాచారం ఇస్తానంది. హీరోయిన్‌ గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా లేడీ విలన్‌ గా వరుసగా సినిమాలు చేస్తున్న వరలక్ష్మి సోషల్‌ మీడియాలో అనేక విషయాల గురించి స్పందిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ అంటూ సమర్థించకున్నా కూడా ఎక్కువగా రాజకీయ అంశాలను షేర్‌ చేస్తూ ప్రజా సమస్యల పట్ల తన సామాజిక బాధ్యతగా స్పందిస్తూ ఉంటుంది. ఆమె అకౌంట్స్‌ హ్యాక్‌ అవ్వడం పట్ల అభిమానులు మరియు ఫాలోవర్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు.