Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కృష్ణ విలన్ డెత్ మిస్టరీ
By: Tupaki Desk | 10 Feb 2019 5:41 AM GMTప్రముఖ బాలీవుడ్ విలన్ మహేష్ ఆనంద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనమైంది. ముంబైలో ఆయన ఫ్లాట్ లో సోఫాలో కూచుని ఉన్న దశలోనే ఆయన మరణించారు. రెండ్రోజుల క్రితమే ఆయన మరణించి ఉంటారని, మృతదేశం కుళ్లిన దశలో కనిపించిందని ముంబై - వెర్సోవా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి పరిశోధిస్తున్న పోలీసులు మహేష్ ఆనంద్ మృతదేశాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు.
మహేష్ ఆనంద్ బాలీవుడ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. 1980- 1990 కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆరడుగుల కండల వీరుడిగా అతడి రూపం, ఆహార్యానికి వీరాభిమానులు ఉన్నారు. మహేష్ ఆనంద్ సౌత్ సినిమాకి .. ముఖ్యంగా టాలీవుడ్ కి సుపరిచితం. సూపర్ స్టార్ కృష్ణ `నంబర్ 1` చిత్రంలో విలన్ గానూ నటించారాయన. ఈ చిత్రంలో ఒక సైకో పాత్రలో భీభత్సమైన కామెడీ చేసిన మహేష్ ఆనంద్ .. ఆ తర్వాత జగదేక వీరుడు అనే వేరొక చిత్రంలోనూ విలన్ గా నటించారు. మహేష్ ఆనంద్ బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. షాహెన్ షా (1998), గంగ జమున సరస్వతి (1998), మజ్బూర్ (1989), స్వర్గ్ (1990), తానేదార్ )1990, విశ్వాత్మ (1992) , కూలీ నంబర్ 1 (1995), విజేత (1996), కురుక్షేత్ర (2000) వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. సుమారు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత గోవిందా నటించిన `రంగీలా రాజా` చిత్రం చిట్టచివరిది.
మహేష్ ఆనంద్ మరణం అనుమానా స్పదం... అసలేం జరిగింది? అన్న కోణంలో పోలీసులు ఆరాలు తీస్తున్నారు. అతడు తన ఇంట్లో చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. తనకి రోజూ టిఫిన్ అందించే కుర్రాడు ఇంట్లో అలికిడి లేకపోవడంతో సెక్యూరిటీకి ఫిర్యాదు చేశాడు. అటుపై పోలీసులు వచ్చి తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్లడంతో ఆచేతన స్థితిలో ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. ముంబై వెర్సోవా ప్రాంతంలోని యారీ రోడ్ లో `కిన్నెర` అనే అపార్ట్ మెంట్ లో ఆయన చాలాకాలంగా ఒంటరిగా నివసిస్తున్నారని, ఆయనకు భార్య లేరని తెలుస్తోంది. మహేష్ భట్ జీవితంలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఓ ప్రకటన ద్వారా వివరాల్ని వెల్లడించారు. అయితే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని భార్యల నుంచి చివరికి దూరమై ఒంటరివాడయ్యాడని చెబుతున్నారు. తొలుత నటి రీనారాయ్ సోదరి బర్కా రాయ్ ని పెళ్లాడారు. ఆ తర్వాత మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరికా మారియా డిసౌజాని 1987లో పెళ్లాడారు. 1992లో మధు మల్హోత్రా అనే నటిని ఆయన పెళ్లాడారు. 2015లో లానా అనే రష్యన్ గాళ్ ని మహేష్ ఆనంద్ వివాహం చేసుకున్నారు.