Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు మృతి

By:  Tupaki Desk   |   29 Dec 2020 5:22 AM GMT
ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు మృతి
X
2020 ఏడాది ఎవ్వరికీ కలిసిరాలేదనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీకి మరింత ఇబ్బంది ఎదురైంది. ఓ వైపు సినిమా నిర్మాణాలు, రిలీజ్ లు నిలిచిపోగా.. మరోవైపు సినీ నటులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు, తమిళ్, హిందీ అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు చాలా మందే కన్నుమూశారు.

తాజాగా.. తమిళ ‘ఖైదీ’ చిత్రంలో నటించిన అరుణ్ అలెగ్జాండర్ మరణించారు. గుండెపోటుతో ఆయన చనిపోయారు. కేవలం 48 ఏళ్ళ వయస్సులోనే ఆయన మృత్యువాత పడడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి సినీ ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

అరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తమిళ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయన ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'మనరం', 'కోలమావు కోకిలా', 'ఖైదీ', 'బిగిల్' సినిమాల్లో మంచి నటనా పటిమ కనబరచారు అరుణ్. త్వరలో విడుదల కానున్న విజయ్ ‘మాస్టర్’ మూవీలోనూ అలెగ్జాండర్ నటించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

కాగా.. ఈ ఏడాది చాలా మంది సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో లెజండరీ నటీనటులు, కొరియోగ్రాఫర్స్, దర్శకులు కూడా ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదలుకొని ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, నిషికాంత్ కామత్, సరోజ్ ఖాన్, జగదీప్, రాక్‌లైన్ సుధాకర్, వడివేల్ బాలాజీ, జయప్రకాష్ రెడ్డి, చిరంజీవి సర్జా, సేతురామన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు తుదిశ్వాస విడిచారు.