Begin typing your search above and press return to search.
డిజాస్టర్ మూవీకి రాజకీయ నాయకుడి బినామీ సొమ్ము?
By: Tupaki Desk | 18 Nov 2022 3:00 AM GMTవిదేశాల్లో డొల్ల (షెల్) కంపెనీలను ప్రారంభించి వాటిలోకి భారతదేశం నుంచి డబ్బును తరలించే రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తల భోగోతం గురించి పత్రికలు మీడియాల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలొచ్చాయి. ఇప్పటికీ కథనాలు వస్తూనే ఉన్నాయి. దేశం నుంచి డబ్బును విదేశాలకు పంపి అక్కడ రకరకాల మార్గాల్లో దాచుకుంటారు. దీనికోసం స్విస్ బ్యాంకునే కాదు.. చాలా రకాల విదేశీ బ్యాంకులను వాడేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలను పాలించే నాయకులే ఇలా చేశారనేందుకు ఈడీ విచారణలో ఆధారాలు లభించడం అప్పట్లో సంచలనమైంది.
అదంతా అటుంచితే రంగుల మాయా ప్రపంచం అయిన సినీరంగంలోకి రకరకాల మార్గాల్లో డబ్బు వచ్చి చేరుతుంటుంది. అది రాజకీయ నాయకుల సొమ్ము కావొచ్చు లేదా పారిశ్రామిక వేత్తలు .. బడా కార్పొరెట్ వ్యాపార వర్గాలకు సంబంధించిన అనధికారిక సొమ్ములు కావొచ్చు. దేశానికి ఆదాయపు పన్ను ఎగవేసేందుకు రకరకాల కుయుక్తులతో ఆ సొమ్ములను తీరం దాటవేస్తుంటారు.
ఇక సినీరంగంలో పెట్టుబడుల వరద పారించే ప్రతి పారిశ్రామిక వేత్త లేదా రాజకీయ నాయకులపై ఎప్పుడూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కన్ను ఉంటుందన్నది.. రహస్య ఆపరేషన్ సాగుతుందన్నది కొద్దిమందికే తెలిసిన రహస్యం. పైగా వివాదాస్పదులు అయిన వారిపై ముఖ్యంగా ఈడీ కన్ను పడుతుంది. గత ట్రాక్ రికార్డును అనుసరించి వారి సొమ్ములు విదేశీ షెల్ కంపెనీలకు చేరుతున్నాయా లేదా? ఇంకేదైనా కంపెనీల్లో పట్టుబడులు పెడుతూ ఆదాయపు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారా? అనే కోణంలో ఐటీ శాఖతో కలిసి ఈడీ దర్యాప్తు జరపడం చూస్తున్నదే. ఇలాంటి విచారణల్లో భయానక నిజాలు బయటపడుతుంటాయి.
ఇప్పుడు అలాంటి ఒక విచారణను టాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకనిర్మాత ఆయన వ్యాపార భాగస్వామి అయిన ప్రముఖ హీరోయిన్ ఎదుర్కొంటున్నారు. ఇటీవలే రిలీజై డిజాస్టర్ రిజల్ట్ అందుకున్న ఓ పాన్ ఇండియా సినిమాకి సదరు నిర్మాతలకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? మార్కెట్ చేసిన సొమ్ములు ఎటు తరలిపోయాయి? అన్నదానిపై విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ ముందు కనీసం హీరోకి పూర్తి పారితోషికం కూడా చెల్లించలేదని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే ఈ సినిమా మంచి మార్కెట్ రేట్లకు అమ్ముడుపోయింది.
నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అద్భుతమైన ధరలకు అమ్ముడయ్యాయి. సినిమా చూశాక నిర్మాణ విలువలు కూడా పరిమితమని.. ప్రొడక్షన్ ఖర్చు కూడా యావరేజ్ అని కూడా విశ్లేషించారు. నిర్మాతలు ప్రచారం చేసిన స్థాయిలో పెట్టుబడులు పెట్ట లేదు. అయితే సినిమా రిలీజై డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. పైగా తెలుగు-తమిళం- హిందీ సహా చాలా భాషల్లో భారీ ధరలకు రైట్స్ అమ్మారు. ఎక్కడా సినిమా ఆడలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నష్టపోయిన బయ్యర్లకు తిరిగి డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చినా కానీ ఎవరికీ పైసా కూడా చెల్లించలేదు. దీంతో రిలీజ్ ముందే సేఫ్ గేమ్ ఆడిన సదరు నిర్మాతలు భారీగా కూడబెట్టిన ఆ డబ్బును ఏం చేశారు? అన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ విచారణలో కొన్ని కఠోరమైన నిజాలు బయటపడుతున్నాయని కూడా ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తీయడానికి విదేశాల నుంచి నిధులు వచ్చాయని కొందరు రాజకీయ నాయకుల బినామీ పెట్టుబడులు కూడా ప్రవహించాయని ఈడీ అనుమానిస్తున్నట్టు గుసగుస వినిపిస్తోంది. సాధారణంగా సినిమా మార్కెటింగ్ పూర్తయ్యాక.. పెట్టుబడిదారుల మధ్య డబ్బు పంపిణీ పూర్తవుతుంది. నిర్మాతల చేతికి భారీగా డబ్బు అందుతుంది. అలాంటప్పుడు ఆ డబ్బంతా ఏమైంది? ఆ డబ్బు కు అదనంగా విదేశీ బినామీల నుంచి పెట్టుబడుల రూపంలో తరలి వచ్చిన అంతర్జాతీయ నిధులు ఏమయ్యాయి? అంటూ ఈడీ విచారణ కొనసాగుతున్నట్టు కథనాలొస్తున్నాయి. అంతేకాదు నిర్మాతల వద్దనే ఆ సొమ్ములు ఉన్నాయా? లేక ఏదో ఒక రూపంలో ఆ డబ్బును ఎక్కడికైనా తరలించారా? అంటూ విచారణ సాగుతున్నట్టు గుసగుసలు స్ప్రెడ్ అవుతున్నాయి.
ఈ కథనాల్లో నిజం ఏమిటన్నది ఈడీ - ఐటీ శాఖలే నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కథనాలపై నిర్మాతల వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీనిపై సదరు పాన్ ఇండియా మూవీ మేకర్స్ వివరణ ఇచ్చి అన్ని గుసగుసలకు చెక్ పెడతారనే భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.