Begin typing your search above and press return to search.
బర్త్ డే స్పెషల్: బాలయ్య మంచిమనసు బయటపెట్టిన పాపులర్ సింగర్..!
By: Tupaki Desk | 10 Jun 2021 12:30 PM GMTటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. నేడు 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఓవైపు నందమూరి అభిమానులు.. మరోవైపు ఇండస్ట్రీ సెలబ్రిటీలు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఆయనతో ఉన్నటువంటి బంధం.. ఆయనలోని మంచి గుణం గురించి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సింగర్ స్మిత.. బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఆయన మంచితనం గురించి చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఈ సందర్బంగా స్మిత మాట్లాడుతూ.. "నేను ఇప్పుడు ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఉంది.. దాదాపు రెండు నెలల క్రితం నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ నుంచి నాకు కాల్ వచ్చింది. తన కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని.. కొడుకు ట్రీట్మెంట్ కోసం వారి ఆస్తులన్నీ అమ్మేశామని.. చాలా కష్టంలో ఉన్నట్లు తెలిపాడు. అలాగే ఇంకా ట్రీట్మెంట్ చేయించడానికి చాలా ఖర్చు అవుతుందని పెద్ద నెంబర్ చెప్పాడు. ఏదైనా చేయగలరా.. అని నన్ను అడిగాడు. నేను ఏం చేయలేనని చెప్పలేక రెండు నిమిషాలు టైం అడిగాను.
ఏది ఆలోచించకుండా వెంటనే ఒక నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ పెట్టాను. 'సార్! ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడటానికి టైం ఇస్తారా?' అని. మెసేజ్ పెట్టిన 5-10నిమిషాలోపే నాకు కాల్ వచ్చింది. స్వయంగా ఆయనే ఫోన్ చేశారు. వెంటనే నేను ఆ జర్నలిస్ట్ సిట్యుయేషన్ గురించి పూర్తిగా చెప్పేసాను. ఆయన రిపోర్ట్స్ అన్నీ ఫార్వర్డ్ చేయండి.. డాక్టర్స్ తో మాట్లాడి మనం చేయగలిగింది చేద్దాం అన్నారు. కానీ కన్ఫర్మేషన్ ఏంటన్నది తెలియలేదు. సరిగ్గా మూడు గంటల్లో నాకు మళ్లీ కాల్ వచ్చింది. హాస్పటల్ నుంచి డాక్టర్స్ ఫోన్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ చూశారు. మొత్తం మేమే చూసుకుంటాం. మీ అబ్బాయి గురించి భయపడాల్సిన పనిలేదు. పేషెంట్‌ని రేపు ఆసుపత్రికి తీసుకురమ్మని చెప్పారు.
అయితే నేను మెసేజ్ పెట్టిన ఆ వ్యక్తి బాలకృష్ణ గారు. ఆ రోజు ఆ మెసేజ్ పెట్టడం వలన బాలకృష్ణ గారు స్పందించడం కారణంగానే ఆ జర్నలిస్ట్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూనే బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒక్క మెసేజ్ పెడితే స్పందించారు. అందరి ఆశీస్సులతో బాలయ్య నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు స్మిత వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.