Begin typing your search above and press return to search.
ఆ పోర్న్ స్టార్ ఎలా మారిందో తెలిస్తే షాకే
By: Tupaki Desk | 13 March 2017 2:02 PM GMTఆమె జీవితం చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఆమె చేసే పనికి.. ఆమె మనస్తత్వానికి ఏ మాత్రం సంబంధం ఉండని వైనం షాకింగ్ గా ఉండటమే కాదు.. ఆమె గురించి ఒక్క కోణం మాత్రమే తెలిసిన వారు.. ఆమెలోని కొత్త కోణం గురించి తెలిసి అవాక్కుఅవుతున్నారు. సెక్స్ సినిమాల్లో నటిస్తుందంటూ నిన్నటి వరకూ చిన్న చూపు చూసిన వారు సైతం.. మారిన ఆమె గురించి సరికొత్తగా మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య వరకూ హాట్ పోర్న్ స్టార్ గా పని చేసిన ఆమె.. ఇప్పుడు తననుతాను మొత్తంగా మార్చేసుకొని.. మత ప్రభోధకురాలిగా (ఫాస్టర్) మారిపోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ఆ పోర్న్ స్టార్ ఎవరు? ఆమె ఎందుకలా మారింది?ఆమెలో అంత మార్పుకు కారణం ఏమిటి? అన్న విషయాలు చూస్తే.. ఆశ్చర్యంగా అనిపించటమే కాదు.. పోర్న్ స్టార్ జీవితాల్లోని చీకటి కోణాలు కూడా తెలిసి అవాక్కు అయ్యేలా చేస్తుంది.
ఇప్పటి దాకా చెప్పిన ముచ్చట అంతా ప్రముఖ పోర్న్ స్టార్ క్రిస్టల్ బస్సెట్టె గురించే. ఏడాదికి రెండు కోట్ల వరకూ సంపాదన.. విలాసవంతమైన జీవితాన్నిగడిపే ఆమె ఇప్పుడు వాటిని వదిలేసి.. అమెరికాలోని ఫాల్టన్ అనే చిన్న టౌన్ లోని చర్చిలో ఫాస్టర్ గా పని చేస్తున్నారు. ఇంతకూ ఆమె అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారన్న విషయంలోకి వెళితే.. కాస్తంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. చాలా చిన్నతనంలోనే లైంగిక దాడికి గురైన బస్సెట్టె.. పదహారేళ్ల వయసులోనే ప్రెగ్నెంట్ అయ్యింది. చిన్న బాబు పుట్టాడు. ఆ పిల్లాడికి అండగా నిలవాలని అనుకుంది. వెంటనే కాలిఫోర్నియా నుంచి హాలీవుడ్ కు నివాసాన్ని మార్చింది.
ముందుగా మోడలింగ్.. ఆ తర్వాత బార్లలో డ్యాన్సులు చేసింది. డబ్బులు కోసం ఇదంతా చేసినఆమె..తర్వాత ఒక అడల్ట్ మూవీలో నటించే అవకాశం వచ్చింది. డబ్బులు ఎక్కువగా ఆఫర్ చేయటంతో ఓకే చెప్పేసింది. అలాంటి సినిమాల్లో నటిస్తే నెలకు రూ.20లక్షలు సంపాదించే వీలుందన్నటెప్టింగ్ ఆఫర్ తో సరే అనేసింది. కానీ.. పోర్న్ స్టార్ గా జీవితం ఎంత కష్టమన్న విషయం ఆమెకు తర్వాత అర్థమైంది.
తొలిసారి పోర్న్ స్టార్ గా నటించి.. ఇంటికి వెళ్లిన తర్వాత.. దాదాపు రెండు గంటల పాటు షవర్ కింద నిలుచొని ఏడుస్తూ ఉండిపోయిందట. ఇప్పటికి ఆ ఘటన తనకు గుర్తు ఉందని చెబుతుందామె. ఆ సినిమా షూట్ అయ్యాక నెల వరకూమరో సినిమా వెళ్లలేకపోయింది. పోర్న్ సినిమాల్లోనటించే సమయంలో ఏం జరుగుతుందన్న విషయం శరీరానికి తెలీకుండా ఉండటం కోసం విపరీతంగా మద్యాన్ని సేవించటం.. పెయిన్ లెస్ మెడిసిన్స్ వాడటం మొదలెట్టింది. పోర్న్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఖరీదైన బంగళా.. విలాసవంతమైన ఫెరారీ కారుతో పాటు ఆరు కార్లను కొనేసింది.
కొడుకును స్కూల్ దగ్గర వదిలేసి.. పోర్న్ సినిమాల షూటింగ్ కు వెళ్లిపోయేది. అలా సాగుతున్న ఆమె జీవితంలో 2014 మేలో తాగిన మత్తులో డ్రైవ్ చేసిన ఆమె కారు ప్రమాదానికి గురైంది. చావుకు దగ్గరగా వెళ్లి బతికిపోయింది. అదే సమయంలో ఆమె మీద కేసు కూడా బుక్ అయ్యింది. అప్పుడే తాను ఎవరికోసం బతుకుతున్నానో అర్థమై.. తన పోర్న్ స్టార్ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయ్యింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె సోదరి పెళ్లి సందర్భంగా చర్చలోని పాస్టర్ ను కలుసుకోవటం.. అతడికి ఆమె గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా ఆమెను పెళ్లాడేందుకు ఓకే చెప్పేయటంతో అతడ్ని పెళ్లాడింది. వారిద్దరి ఒక కొడుకు పుట్టారు.తర్వాత ఆమె ఫాస్టర్ గా శిక్షణ పొంది.. ఇప్పుడు సొంతంగా ఒక చర్చిని ఏర్పాటు చేసి.. కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసింది. తానిప్పుడు డబ్బు గురించి అస్సలు ఆలోచించటం లేదని.. పేదలకు సాయం చేయటం..నాలుగు మంచి మాటలు చెప్పటం మీదనే తన దృష్టి పెట్టినట్లుగా వెల్లడించింది. నీలి చిత్రాలు చూసినప్పుడు కామోద్రేకాన్ని పుట్టించేలా ఉండే వారి వెనుక జీవితాలు ఎలా ఉంటాయనటానికి బస్సెట్టె జీవితం ఓ పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/