Begin typing your search above and press return to search.

రాజ్ కుంద్రా ల్యాప్ ట్యాప్లో 119 ఫోర్న్ వీడియోలు: కోట్ల రూపాయల షాకింగ్ డీల్స్!

By:  Tupaki Desk   |   21 Sep 2021 9:58 AM GMT
రాజ్ కుంద్రా ల్యాప్ ట్యాప్లో 119 ఫోర్న్ వీడియోలు: కోట్ల రూపాయల షాకింగ్ డీల్స్!
X
ఫొర్న్ చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆయన విషయంలో విచారణ చేపట్టిన ముంబై పోలీసులు పలు విషయాలు రాబట్టారు. ఆయనతో సంబంధం ఉందని తెలిసిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. చివరికి నటి శిల్పాశెట్టిని కూడా విచారించిన విషయం తెలిసిందే. అయితే కొంత మంది హీరోయిన్లు తమకు మాములు సినిమాలు అని చెప్పి ఆ తరువాత బోల్డ్ సినిమాలు చేయించారని ఆరోపించారు. శిల్పాశెట్టి మాత్రం తన భర్త అమాయకుడని అంటోంది. అయితే పక్కా సమాచారంతోనే రాజ్ కుంద్రాను అరెస్టు చేయాల్సి వచ్చిందని ముంబై పోలీసులు ఇదిరవకే ప్రకటించారు. తాజాగా రాజ్ కుంద్రా ల్యాప్ టాప్ లో కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి.

రాజ్ కుంద్రా ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు, ఇతర హార్డ్ డిస్కుల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఎకంగా 100కు పైగా అంటే ఫోర్న్ వీడియోలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఫోర్న్ చిత్రాలు తీశారని అనుమానించిన పోలీసులు ఆయనకు సంబంధించిన ల్యాప్ టాప్ ను తనిఖీ చేశారు. దీంతో వారికి 119 పోర్న్ వీడియోలు లభ్యమయ్యాయి. అయితే ఇంతటితోనే పూర్తి కాలేదని, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పూర్తిగా హార్డ్ డిస్క్ లు, మొబైల్లో తనిఖీలు చేస్తే మరెన్నో విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఫోర్న్ వీడియోలు తీయడమే కాకుండా వాటిని వివిధ యాప్ ల ద్వారా ఇతరులకు విక్రయిస్తారని రాజ్ కుంద్రాపై ఆరోపణలున్నాయి. ఆయన సోదరుడు ప్రత్యేకంగా యాప్ ను తయారు చేసి వాటి ద్వారా బయ్యర్స్ ను ఆకర్షించేవాడని పోలీసులు తెలిపారు. ఇలా ఇతర దేశాల నుంచి డీలింగ్స్ పెట్టుకునే వారు. ఈ క్రమంలో ఓ ఆప్రికన్ బ్యాంకు ద్వారా ఫోర్న్ వీడియోలను రూ.9 కోట్లకు విక్రయించేందుకు రెడీ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే రాజ్ కుంద్రాను పెట్టుకున్నబెయిల్ పిటిషన్ రద్దు చేసింది కోర్టు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈ విషయాలను ముందుంచారు.

తాను తీసిన ఫోర్న్ వీడియోలను విక్రయించేందుకు ఆన్ లైన్ బెట్టింగ్ లను వేదికగా చేసుకునేవాడు. పలు గేముల్లో రాజ్ కుంద్రా పాల్గొనేవాడు. ఆ సమయంలో కొందరితో డీలింగ్స్ పెట్టుకొని వారి ద్వారా ఫోర్న్ వీడియోలను విక్రయించేవాడు. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికాలో తనకు అకౌంట్స్ ఉన్నాయని, వాటి ద్వారా ఫోర్న్ వీడియోలను బేరానికి పెట్టారని వివరించారు. ఇలా ఆ బ్యాంకు ద్వారా రూ. 9 కోట్ల డీలింగ్స్ నడిపినట్లు వెలుగులోకి వచ్చింది.

ఇవే కాకుండా రాజ్ కుంద్రా మరెన్నో డీలింగ్స్ చేశారని, అయితే పూర్తి ఆధారాల కోసం విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు. దర్యాప్తునకుకొందరు సహకరిస్తున్నా.. మరికొందరు సహకరించడం లేదని అంటున్నారు. అయితే కచ్చితంగా ఇందులోని అసలు గుట్టును బయటపెడుతామంటున్నారు. ఎంతటి వారినైనా విచారించి తీరుతామంటున్నారు.

ఇక ఇంతటి తతంగం నడిపించిన రాజ్ కుంద్రాకు ఇప్పడేబెయిల్ ఇవ్వొద్దని, మరికొన్నిరోజుల పాటు తమ కస్టడికి అప్పగించాలని పోలీసులు కోరారు. కానీ ముంబై కోర్టు రూ.50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు వ్యాపార భాగస్వామి ర్యాన్ థోర్పేకు సైతం బెయిల్ లభించింది. అయితే పోలీసులు మరోసారి కోరడంతో న్యాయస్థానం బెయిల్ రద్దు చేస్తుందా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక రాజ్ కుంద్రాకు బెయిల్ దొరకడంతో అతని కుమారుడు ట్విట్టర్లో 'గణపతి బప్ప మోరియా' అని ట్వీట్ చేశాడు.