Begin typing your search above and press return to search.

బోయపాటి అంటే పోసానికి ఎందుకంత కోపం?

By:  Tupaki Desk   |   17 Oct 2016 11:30 AM GMT
బోయపాటి అంటే పోసానికి ఎందుకంత కోపం?
X
పోసాని కృష్ణమురళికి బోయపాటి శ్రీనుతో ఎక్కడ తేడా జరిగిందో తెలియదు కానీ.. అతడి పేరెత్తితే చాలు ఆవేశంతో ఊగిపోతాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో బోయపాటిని బూతులు తిట్టాడు పోసాని. తాజాగా మరోసారి బోయపాటిపై తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు పోసాని. బోయపాటికి తాను లైఫ్ ఇస్తే.. తన దగ్గరే అతను చాలా చీప్ గా బిహేవ్ చేశాడని వ్యాఖ్యానించాడు పోసాని. తనకు బోయపాటిపై అంత కోపమెందుకో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు.

ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో భాగంగా.. మీ దగ్గర పని చేసిన చాలామంది ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు కదా.. దాని గురించి మీ ఫీలింగేంటి అని పోసానిని అడగ్గా.. “చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన భోయపాటి శ్రీనును నేనే స్వయంగా ముత్యాల సుబ్బయ్య దగ్గర చేర్పించా. నా మాట వల్లే ఎన్నో ఏళ్ళు సుబ్బయ్య గారి దగ్గర భోయపాటి పనిచేశాడు. అలాంటి భోయపాటి ఒకసారి చాలా చీప్‌ గా బిహేవ్ చేశాడ”ని పోసాని కృష్ణమురళి అన్నారు.

“నా దగ్గర పనిచేసిన వాళ్లలో త్రివిక్రమ్.. కొరటాల శివ.. ఇలాంటి వాళ్లతో సహా 30 మందికి పైగా ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్లందరూ నాకు ఎంతో గౌరవమిస్తూ మాట్లాడతారు. కానీ నేను నా వాడు అనుకుని ముత్యాల సుబ్బయ్య దగ్గర పనిలోకి పెట్టిన బోయపాటి శ్రీను మాత్రం ఒకసారి చాలా చీప్‌ గా బిహేవ్ చేశాడు. అతను పేద కుటుంబం నుంచి వచ్చాడు. నా మాట వల్లే ఎన్నో ఏళ్లు ముత్యాల సుబ్బయ్య దగ్గర పని చేశాడు. కానీ ఓ సందర్భంలో నా దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒకటి ఫ్లాప్ అయింది. దాని గురించి మా ఆవిడతో మాట్లాడుతూ.. ‘మేమంటే దర్శకత్వ విభాగంలో పని చేశాం. కానీ అన్నయ్య చేయలేదు కదా.. అందుకే సినిమా పోయింది. మున్ముందు ఇంటికి సంబంధించిన బిల్లులు కట్టుకోవడానికి కష్టపడాలేమో కదా వదినా’’ అంటూ ఎగతాళిగా మాట్లాడినట్లు తెలిసింది. మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు అర్థం కాదు. ఇప్పటికీ అతడి ఆ ప్రవర్తనను మాత్రమే తప్పు పట్టా. నాకు ఎవ్వరి మీదా వ్యక్తిగత కక్షలు ఉండవు” అని పోసాని తెలిపాడు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/