Begin typing your search above and press return to search.
పవన్ పై మరిన్ని పంచ్ లు ఖాయమట.. అసలు కారణం అదేనట
By: Tupaki Desk | 28 Sep 2021 3:42 AM GMTరిపబ్లిక్ ప్రీరిలీజ్ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన సంచలన ప్రసంగం తర్వాత నెలకొన్న ప్రతిస్పందనల గురించి తెలిసిందే. ఆయన మాటలకు కౌంటర్లు ఇచ్చేందుకు ఒకరికొకరు ఎంతలా పోటీ పడ్డారో తెలిసిందే. అదే సమయంలో.. ఆయనపై ఘాటు విమర్శలు చేసిన వారిలో కొందరిని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేసి మరీ మాట్లాడించి.. తిట్టించినట్లుగా చెబుతున్నారు. ఈ మధ్యన ఇలాంటి ట్రెండ్ ఎక్కువైందన్న సంగతి తెలిసిందే.
ఇది సరిపోనట్లుగా ఇండస్ట్రీకి చెందిన వారి చేత కూడా మాట్లాడించటం ద్వారా.. పవన్ మాటలకు పరిశ్రమలోనే మద్దతు లేదన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పవన్ చేసిన విమర్శలు.. వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్న ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఒకవైపు ఉంటే.. మరోవైపు ఈ అంశాన్ని ‘మా’ ఎన్నికలతో ముడి పెట్టేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గతానికి భిన్నంగా ‘మా’ ఎన్నికల్లో ఈసారి చోటుచేసుకున్న ట్విస్టు అన్ని ఇన్ని కావన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం మెగా కాంపౌండ్ ఎవరికైతే మద్దతు ఇస్తుందో.. వారే విజేతలుగా నిలవటం తెలిసిందే. ఈసారి దానికి బ్రేక్ చెప్పాలన్నట్లుగా తెర వెనుక పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. అందరిని కలుపుకు వెళ్లే చిరంజీవిని ఇండస్ట్రీలో ఢీ కొనటం కష్టమన్న వేళ.. అందుకు భిన్నంగా ఆవేశాన్ని ఏ మాత్రం ఆపుకోకుండా.. నర్మగర్భంగా కాకుండా సూటిగా.. సుత్తి లేకుండా.. ముఖం పగిలిపోయేలా మాట్లాడే అలవాటున్న పవన్ ను ఒక బూచిగా చూపించాలన్న ఎత్తుగడ షురూ అయినట్లు చెబుతున్నారు.
‘మా’ ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్నాయి. ఈసారి పవన్ పేరు చెప్పి.. ఆయన వ్యతిరేక వర్గాన్ని ఒక జట్టుగా కట్టాలన్న ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నానికి పవన్ కల్యాణ్ ఆవేశపు ప్రసంగం తోడైనట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘మా’ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు పవన్ ను టార్గెట్ చేస్తూనే ఉంటారని.. ఆయన్ను ఎంతలా ఇరుకున పెడితే.. అంతలా వారి ప్రత్యర్థులకు ఎన్నికల్లో మైలేజీ పెరగటమే కాదు.. మెగా కాంపౌండ్ ఓట్ బ్యాంకు మీద ప్రభావాన్ని చూపించేలా ప్రయత్నాలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల వేళ.. వీలైనన్ని వివాదాలు చోటు చేసుకోవటం ద్వారా తాము ప్రయోజనాలు పొందాలని కోరుకుంటారు. అలాంటివేమైనా చోటు చేసుకుంటే పండుగ చేసుకుంటారు. పవన్ పుణ్యమా అని మెగా కాంపౌండ్ లో చీలిక తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.