Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ 10కోట్లే తీసుకుంటారా?.. చెప్పు దెబ్బ తింటానంటూ పోసాని ఫైర్!

By:  Tupaki Desk   |   28 Sep 2021 3:38 AM GMT
ప‌వ‌న్ 10కోట్లే తీసుకుంటారా?.. చెప్పు దెబ్బ తింటానంటూ పోసాని ఫైర్!
X
ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా పొలిటిక‌ల్ వ‌ర్గాల్లోనూ ప‌వ‌ర్ ప్ర‌సంగంలో వేడి చ‌ర్చ‌కు వ‌చ్చింది. రిపబ్లిక్ ఈవెంట్ లో స్టార్ హీరో కం రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం వివాదాస్పదంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హారంపై ఆయ‌న భ‌గ‌భ‌గ మండిన తీరు స‌ర్వ‌త్రా చర్చ‌నీయాంశ‌మైంది. అయితే ప‌వ‌న్ కి తాజాగా మ‌రో కౌంట‌ర్ ప‌డింది. తాజా మీడియా ఇంటరాక్షన్ లో ప్రముఖ నటుడు.. YSRCP సానుభూతిపరుడు పోసాని కృష్ణ మురళి `తప్పుడు పారితోషికం` వాదనలపై పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు.

పవన్ కళ్యాణ్ మీరు ప్రతి సినిమాకు 10 కోట్లు వసూలు చేస్తున్నాన‌ని అన్నారు. ప్రజలు మూర్ఖులు అని మీరు అనుకుంటున్నారా? మీరు ఒక్కో సినిమాకు రూ .50 కోట్లు వసూలు చేస్తున్నారు కదా. తప్పు అని నిరూపించబడితే నేను చెప్పు దెబ్బ కోసం సిద్ధంగా ఉన్నాను. మీరు నిజంగా ప్రతి సినిమాకు రూ. 10 కోట్లు తీసుకుంటే.. నేను మీకు ఒక్కో సినిమాకు రూ .15 కోట్లు ఆఫర్ చేస్తాను. మీరు నా కోసం 4 ప్రాజెక్ట్ లపై సంతకం చేస్తారా? అని పోసాని తన దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

తన అన్ని సినిమాలకు హీరోయిన్లు.. లొకేషన్లు.. రెమ్యూనరేషన్ క‌థ‌ల‌న్నిటినీ కూడా పవన్ నిర్ణయిస్తారని పోసాని ఆరోపించారు. పోసాని కూడా పవన్ కళ్యాణ్ సినిమాల టిక్కెట్లు రూ.500 ... రూ. 1000 రూపాయలకు అమ్ముతున్నారని అది మధ్యతరగతిని దోచుకోవడం తప్ప మరొకటి కాదని అన్నారు. తన సోదరుడు చిరంజీవి నుండి జీవితంలో మరింత సంస్కారాన్ని నేర్చుకోవాలని పవన్ కు పోసాని సలహా ఇచ్చారు. ఓవ‌రాల్ గా ప‌వ‌న్ ప్ర‌సంగానికి కౌంట‌ర్లు వేసేందుకు పొలిటిక‌ల్ కారిడార్ నుంచే కాదు సినీరంగం నుంచి కొంద‌రిని దించార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఛాంబ‌ర్ .. ప్ర‌కాష్ రాజ్ కూడా వ్య‌తిరేక‌మేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రిప‌బ్లిక్ వేదిక‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో అట్టుడికించ‌గా అత‌డిపైనే తిరిగి ఇండ‌స్ట్రీ నుంచి కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. ఆయ‌న సూటిగా ఏపీ ప్ర‌భుత్వాన్ని .. సీఎం జ‌గ‌న్ ని.. మంత్రి పేర్ని నానిని ఘాటైన ప‌ద‌జాలంతో తూర్పార‌బ‌ట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు తీవ్ర న‌ష్టం క‌లిగిస్తోంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్య‌లు పూర్తిగా ఇండివిడ్యువ‌ల్ గా చేసిన‌వి అని వాటిని ప‌రిశ్ర‌మ‌కు ఆపాదించుకోలేమ‌ని తాజాగా తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఓ అధికారిక లేఖ‌లో సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చింది. ఇరు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా ఉన్నాయి. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ల నుంచి అన్ని విధాలా స‌హ‌కారం ఉంద‌ని స‌ద‌రు లేఖ‌లో పేర్కొన్నారు. 2020-21 సీజ‌న్ అంతా క‌రోనా మ‌యం అయిపోయి ప‌రిశ్ర‌మ తీవ్ర ఇబ్బందుల్లో ప‌డిందని వేలాది కార్మికులు ఆధార‌ప‌డి జీవిస్తున్న ఈ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వాల ప్రోత్సాహ‌కం చాలా అవ‌స‌ర‌మ‌ని లేఖ‌లో కోరారు. ఇటీవ‌ల మంత్రి పేర్ని నానీతో స‌మావేశంలో అన్ని విష‌యాల‌ను ఎంతో ఓపిగ్గా విన్నార‌ని.. ప‌రిశ్ర‌మ సాధ‌క‌బాధ‌కాల‌ను ప‌రిశీలించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఆయ‌న స‌హ‌క‌రించార‌ని కూడా లేఖ‌లో వెల్ల‌డించారు. క‌రోనా వ‌ల్ల ప‌రిశ్ర‌మ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని అన్నారు.

ఆస‌క్తిక‌రంగా ఈ లేఖ‌లో ముద్రించిన‌ ఒక వాఖ్య ప్ర‌త్యేకంగా అంద‌రినీ ఆక‌ర్షించింది. సీఎం జ‌గ‌న్ ఓపిగ్గా టాలీవుడ్ స‌మ‌స్య‌లు వింటున్నార‌ని పాజిటివ్ గా స్పందించి అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్నార‌ని.. తెలుగు ఫిలింఛాంబ‌ర్ లేఖ‌లో పేర్కొన‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు తావిచ్చింది. ప‌వ‌న్ కామెంట్ ఎఫెక్ట్.. ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షులు నారంగ్ కె దాస్ ఈ జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌కాష్ రాజ్ సైతం అస‌లు ప‌రిశ్ర‌మ‌కు ప్రభుత్వాల స‌హ‌కారం లేనిదే ఏదీ జ‌ర‌గ‌ద‌ని అన్నారు. ప‌వ‌న్ ఓ రాజ‌కీయ నాయ‌కుడు.. దేశం కోసం పోరాడుతున్నాడు..ఆయ‌నొక మంచి నాయ‌కుడు.. అత‌ని కంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి. ప‌వ‌న్ `మా` స‌భ్యుడే అని తెలిపారు. అయితే ఎవ‌రు ఎన్ని చెప్పినా ఆయ‌న మంచి కోస‌మే మాట్లాడ‌తార‌ని.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు దాని ప్ర‌తిఫ‌లాన్ని బ‌ట్టి ముందుకు వెళ‌తామ‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రిలోనూ ప్రేమ‌.. ఆవేశం వుంటాయ‌ని.. వాళ్ల‌ని మాట్లాడ‌నివ్వాల‌ని ప్ర‌కాష్‌ రాజ్ కోరారు. త‌న ప్యానెల్ ల‌క్ష్యం అభ్యుద‌య‌మేన‌ని తెలిపిన ప్ర‌కాష్‌ రాజ్ రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌పై ద‌య‌చేసి ఎవ‌రూ ప్ర‌శ్నించ‌వ‌ద్ద‌ని ప్ర‌కాష్‌ రాజ్ కోర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సూటిగా ప్రశ్నిస్తూ మాట్లాడే ప్ర‌కాష్ ‌రాజ్ ఇలా డిప్ల‌మాటిక్‌ గా మాట్లాడ‌టం ఏంట‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.