Begin typing your search above and press return to search.
అప్పుడే చచ్చిపోను.. వదంతులపై క్లారిటీ ఇచ్చిన పోసాని
By: Tupaki Desk | 31 July 2019 1:57 PM GMTసినీ నటుడు - వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి అంతిమ ఘడియల్లో ఉన్నారంటూ వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. తన ఆరోగ్యం ఇప్పుడు బాగుందని.. తనకేమీ కాదని.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని చెప్పారు.
గతంలో తనకు ఆపరేషన్ చేసిన భాగాల్లో ఇన్ ఫెక్షన్ రావడంతో మళ్లీ ఆపరేషన్ చేశారని.. మరో ఆపరేషన్ చేయడంతో బతికానని చెప్పారు. ఆ ఆపరేషన్ చేయకపోతే చనిపోయి ఉండేవాడినన్నారు. ఆపరేషన్ జరిగిన మరునాటి నుంచి తన ఆరోగ్యం బాగయిపోయిందన్నారు. అయితే.. ఇదే సమయంలో సోషల్ మీడియాలో తనపై వదంతులు వ్యాపించాయని ‘విఫలమైపోయిన ఆపరేషన్.. విషమ పరిస్థితిలో పోసాని కృష్ణమురళి’ అంటూ కథనాలు వెలువడ్డాయని - ఇలాంటి వాటితో తన భార్య చాలా బాధపడిందని చెప్పారు. అసత్య కథనాల వల్ల తనకు సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చే వాళ్లు కూడా ఇవ్వరని, ‘పోసాని బతకడం చాలా కష్టమటగా’ అని ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం తనకు తెలుసని చెప్పారు. ఆ తర్వాత ‘నేను బాగున్నాను’ అని మీడియా ద్వారా చెప్పినా అది మాత్రం ఎవరికీ చేరలేదన్నారు.
‘నేను వెరీ హెల్దీగా ఉన్నా. ఆరోగ్యం చాలా బాగుంది. రెండు ఆపరేషన్లు చేశారు. సోషల్ మీడియాలో వచ్చినట్లు అందులో ఒకటి ఫెయిల్ కాలేదు. ఇన్ఫెక్షన్ వచ్చింది. రెండో ఆపరేషన్ ను డాక్టర్ ఎంవీ రావు గారు చేశారు. ఆయన వలనే నేను బతికా’ అని అన్నారు. గతంలో తన భార్యకు ‘నిమోనియా’ వస్తే డాక్టర్ ఎంవీ రావే బతికించారని గుర్తుచేశారు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నా కాబట్టి, నాకు వేషాలు ఇవ్వొచ్చని.. ఇప్పుడప్పుడే చనిపోనని అన్నారు.