Begin typing your search above and press return to search.
పోసాని పంచ్ బోయపాటి మీదేనా?
By: Tupaki Desk | 29 April 2018 4:30 PM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. పోసాని కృష్ణమురళి శిష్యుడన్న సంగతి తెలిసిందే. ఐతే బోయపాటి పేరెత్తితే చాలు పోసాని మండిపోతాడు. అతనొక నమ్మక ద్రోహి అంటాడు. గతంలో బోయపాటిపై సూటిగా విమర్శలు గుప్పించాడు పోసాని. ఆ తర్వాత వీలు చిక్కినపుడల్లా బోయపాటి పేరెత్తకుండా సెటైర్లు వేస్తూనే ఉంటాడు. తాజాగా ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్లో పోసాని చేసిన వ్యాఖ్యలు బోయపాటిని ఉద్దేశించినవేనేమో అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఈ వేడుకలో పోసాని ఏమన్నాడో చూద్దాం పదండి.
తన మేనల్లుడు.. శిష్యుడు అయిన కొరటాల శివ మంచి రచయిత అని.. ఐతే అతను సినీ పరిశ్రమలో చాలా సంపాదించాడని అంతా అనుకుంటారని... కానీ అతను ఇక్కడ ఎక్కువ సంపాదించడం కంటే ఎక్కువ పోగొట్టుకున్నాడని పోసాని అన్నాడు. కొరటాల కథల్ని వేరే వాళ్లు కొట్టేయకుండా ఉంటే అతను ఇప్పటికే పది బ్లాక్ బస్టర్లు తీసేవాడని పోసాని అన్నాడు. ఈ సందర్భంగా కొరటాల ఇంటర్వ్యూలో బోయపాటి పేరెత్తకుండా చేసిన ఆరోపణల గురించి ప్రస్తావించాలి. ‘సింహా’ కథ తాను రాసిందే అని.. దానికి బోయపాటి క్రెడిట్ ఇవ్వలేదన్నట్లుగా మాట్లాడాడు కొరటాల.
దీన్ని బట్టి కొరటాల కథల్ని కొట్టేశారంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు బోయపాటికి కూడా తగులుతాయనడంలో సందేహం లేదు. ఇక రచయితగా కొరటాలకు తనకు ఉన్న తేడా గురించి కూడా పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో రాజకీయ నాయకుల అవినీతి.. అక్రమాల విషయంలో హీరో వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చినపుడు తనను డైలాగ్ రాయమంటే ‘మిమ్మల్ని తిట్టడానికి కొత్త భాష కనిపెట్టాలిరా’ అని రాసేవాడినని.. కానీ కొరటాల మాత్రం ‘మిమ్మల్ని మగాళ్లుగా మారుస్తానని హామీ ఇస్తున్నా’ అని రాశాడని.. అతడి శైలి అంత బాగా ఉంటుందని కితాబిచ్చాడు పోసాని.