Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ శివుడైతే నేను నంది

By:  Tupaki Desk   |   25 Sept 2017 10:05 PM IST
ఎన్టీఆర్ శివుడైతే నేను నంది
X
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం లో తెరకెక్కిన జై లవకుశ సినిమా ఎట్టకేలకు పాజిటివ్ టాక్ ను అందుకొని మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా జై లవకుశ మంచి రికార్డులను సైతం నమోదు చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉండడంతో ఎన్టీఆర్ కి మరో మంచి విజయం దక్కింది. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ సందర్బంగా చిత్ర నటుడు పోసాని తారక్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అంతే కాకూండా అయనలో ఉన్న మాటల రచయితను కూడా పోసాని బయటపెట్టారు. తారక్ గురించి మాట్లాడుతూ.. జ్వరాన్ని కొలవడానికి థర్మామీటర్‌ - పాల చిక్కదనం తెలుసుకోవడానికి లాక్టోమీటర్‌ - షుగర్ లెవల్స్ ని తెలిపే గ్లూకో మీటర్‌. ఇలా ప్రతి ప్రక్రియ సామర్ధ్యాన్ని కొలిచేందుకు మీటర్లు ఉన్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ నటనలో ఎంత దమ్ము ఉందొ చెప్పడానికి ఏదైనా మీటర్ ఉందా? అంటే అది ఈస్తటిక్‌ మీటర్‌ అని చెప్పారు. ఈస్తటిక్‌ మీటర్‌ అంటే తన భావంతో వివరించారు పోసాని. దాన్ని తెలుగులో రస హృదయం అంటరాని అది ఉన్నవాడికి ఎన్టీఆర్ నటనలో ఎంత దమ్ముందో తెలుస్తుందని చెప్పారు.

ఇక ఎన్టీఆర్ తో టెంపర్ లో నటించానని మళ్లీ ఇప్పుడు జై లవకుశ లో నటించానని చెబుతూ.. జై లవకుశలో నటనముందు ఎవరి సరిపోరని. ఇక టెంపర్ లో అయితే తారక్ పక్కన నటించగానే శివుడి పక్కన నందిలా తనకు పేరొచ్చిందని చెప్పారు. ఎందుకంటే తారక్ సీన్ గంటముందే డైలాగ్ బట్టీ కొట్టి చెప్పేవాడని పోసాని వివరించారు.