Begin typing your search above and press return to search.
మహేష్ కోసం పోసాని కొత్తగా..
By: Tupaki Desk | 31 Aug 2017 4:14 AM GMTమహేష్ బాబు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అతడి అభిమానులు. పండగ కానుకగా సెప్టెంబర్ 27న స్పైడర్ థియేటర్లకు రానున్నాడు. మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మొదటిసారి మహేష్ బాబు గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు. స్పైడర్ షూటింగ్ అవుతుండగానే తర్వాత సినిమాకు ఓకే చెప్పి షూటింగ్ స్టార్ట్ చేశాడు. తనకు శ్రీమంతుడు లాంటి బంపర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను మూవీ చేస్తున్నాడు.
స్పైడర్ లో మోడ్రన్ స్పైగా మహేష్ బాబు దుమ్ము దులపనుంటే భరత్ అనే నేనులో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ వర్క్ స్పీడందుకుంది. ప్రస్తుతం సినిమాలో కీలక ఘట్టాలు తెరకెక్కిస్తున్నారు. సినిమా యూనిట్ చెబుతున్న దాని ప్రకారం భరత్ అనే నేనులో పోసాని కృష్ణ మురళి క్యారెక్టర్ హైలైట్ గా నిలవనుంది. ఈ సినిమాలో పోసానిది చాలా కీలకమైన రోల్. డిఫరింగ్ డైలాగ్ డెలివరీ అండ్ కామెడీతో ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్ టెయిన్ చేయనున్నాడట. మొత్తం మీద ఈ సినిమాలో పోసాని కొత్తగా కనిపిస్తాడు అంటున్నారు.
సరైన క్యారెక్టర్ దొరకాలే కానీ తన యాక్టింగ్ తో అదరగొట్టేయడం పోసానికి కొత్తేం కాదు. టెంపర్ - నాయక్ - రేసుగుర్రం లాంటి సినిమాల్లో అతడి పెర్ఫార్మెన్స్ ఎంతగా ఎంటర్ టెయిన్ చేసిందో తెలిసిందే. ఈసారి మహేష్ తో కలిసి ఆడియన్స్ కు నవ్వుల విందు పంచనున్నాడు. కమర్షియల్ సినిమాలే తీసినా వాటిలో అండర్ కరెంట్ గా ఓ మంచి సందేశం ఇస్తూ సినిమా తీయడం డైరెక్టర్ కొరటాల శివ స్టయిల్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న భరత్ అనే నేను సంక్రాంతికి థియేటర్లకు రానుంది.