Begin typing your search above and press return to search.

పోసాని వైఫ్ ఆయ‌న సెల‌క్ష‌నేన‌ట‌!

By:  Tupaki Desk   |   29 April 2018 10:45 AM IST
పోసాని వైఫ్ ఆయ‌న సెల‌క్ష‌నేన‌ట‌!
X
పోసాని మాట‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మాట‌ల్లో ఎంత తీవ్ర‌త ఉన్నా.. ఆయ‌న మాట్లాడుతుంటే అదే ప‌నిగా వింటూ ఉండిపోయేలా చేస్తాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త విష‌యాలు చెప్పే పోసాని.. తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని చెప్పారు. భ‌ర‌త్ అనే నేను చిత్ర విజ‌యోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మాట్లాడిన పోసాని మాట‌లు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మారాయి.

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న మేన‌ల్లుడ‌ని.. త‌న కొడుకు ప్ర‌జ్వ‌ల్ ఈ సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడంటూ కొత్త ముచ్చ‌ట్లు చెప్పిన పోసాని.. త‌న పెళ్లిచూపుల ఎపిసోడ్ ను ఆయ‌న మాట‌ల్లోనే చెబితే..

"నా మేన‌ల్లుడు కొర‌టాల శివ‌. వీడికి స్పెష‌ల్ టేస్ట్ ఉంది. నా పెళ్లి చూపుల‌కు వీడ్ని తీసుకెళ్లా. అల్లుడూ.. అమ్మాయి ఎలా ఉందిరా? అని అడిగా. మామా.. అమ్మాయి బాగుంది చేసుకో అన్నాడు. ఒట్టు.. నేను ఆ అమ్మాయినే చేసుకున్నా. స‌గం వీడి మీద న‌మ్మ‌కం.. స‌గం నా పెళ్లాం మీద న‌మ్మ‌కం.(పోసాని నోట్లో నుంచి ఈ మాట‌లు వ‌స్తున్న‌ప్పుడు మ‌హేశ్ బాబు సోఫాలో నుంచి లేచి మ‌రీ న‌వ్వ‌టం.. ఆ ప‌క్క‌న కూర్చున్న కొర‌టాల శివ సైతం ముసిముసిన‌వ్వులు న‌వ్వారు)"

"చిన్న‌ప్ప‌టి నుంచి వాడ్ని(కొర‌టాల శివ‌ను) ఎత్తుకొని తిరిగా. అప్ప‌టి నుంచి మాట‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయి మ‌హేశ్ బాబు మాదిరి. చేత‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత కొర‌టాల శివ చాలా సంపాదించుకున్నాడంటారు. కానీ.. ఎక్కువ‌గా పోగొట్టుకున్నాడు. వాడి క‌థ‌ల్ని చాలామంది కాపీ చేశారు. లేక‌పోతే.. ఓ ప‌ది సినిమాలు సూప‌ర్ హిట్లు కొట్టేవాడు. ఏరా.. నువ్వు చెబుతావా అది? అన్న పోసాని మాట‌ల‌కు కొర‌టాల అవున‌న్న‌ట్లు త‌ల ఊపారు. డైలాగులు రాసే విష‌యంలో నాకు.. కొర‌టాల శివ‌కు తేడా ఏమిటంటే.. రాజ‌కీయ నాయ‌కులు చేసే అవినీతి గురించి చెప్పాలంటే.. మిమ్మ‌ల్ని తిట్టాలంటే కొత్త భాష క‌నిపెట్టాల్రా అని రాస్తా. కానీ.. శివ ఏం రాస్తాడంటే.. మిమ్మ‌ల్ని మ‌గాళ్లుగా త‌యారు చేస్తాన‌ని మాటిస్తున్నా.. నాది ప్రాక్టిక‌ల్ నేచ‌ర్‌.. త‌న‌ది పాజిటివ్ నేచ‌ర్‌. అంతే మా ఇద్ద‌రికి తేడా"

"మ‌హేశ్ గురించి ఏం చెబుతాం. మ‌హేశ్ అలానే ఉన్నాడు. అంతే అందంగా ఉన్నాడు. మేం ముస‌లోళ్లం అయిపోతున్నాం.. మ‌హేశ్ మాత్రం అలానే ఉన్నాడు. మా అబ్బాయికి మూడేళ్ల వ‌య‌సు నుంచి మ‌హేశ్ అంటే ఇష్టం. వాడు కూడా ఇప్పుడు నాకు మ‌హేశ్ కంటే పెద్దోడిగా క‌నిపిస్తున్నాడు. నువ్వు అలానే ఉండాలి. నేను సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్‌. ఆయ‌న కూడా అందంగా ఉంటారు. ఆయ‌న మ‌నసు అంతే అందంగా ఉంటుంది. మ‌హేశ్ అందంగా ఉంటారు. ఆయ‌న మ‌న‌సు ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నా"

"భ‌ర‌త్ అనే నేను సినిమా స‌క్సెస్ కావాల‌ని అంద‌రి కంటే తానే ఎక్కువ‌గా టెన్ష‌న్ ప‌డ్డా. నా కొడుకు ప్ర‌జ్వ‌ల్ తొలిసారి ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు" అని చెప్పారు పోసాని. సినిమా విడుద‌ల‌య్యాక‌.. అదే ప‌నిగా నెట్ లో బ్రౌజ్ చేస్తున్నాడ‌ని.. సినిమా హిట్ అవుతుందంటే.. నాకు తెలుసంటూ స‌మాధానం ఇచ్చాడ‌న్నారు. సినిమా సూప‌ర్ హిట్ అయ్యింద‌ని చెప్పాన‌ని.. మ‌హేశ్ సినిమా ఫెయిల్ అయితే.. మౌనంగా ఓపక్క‌కు వెళ్లి అదే ప‌నిగా నెట్ లో బ్రౌజ్ చేస్తూ ఉండిపోతాడ‌ని.. మ‌హేశ్ అంటే త‌న కొడుక్కి అంత ఇష్ట‌మ‌ని చెప్పారు. మ‌హేశ్ మ‌న‌సును దోచేలా చెప్ప‌ట‌మే కాదు.. ప్ర‌జ్వ‌ల్ ఎంతగా మ‌హేశ్ ఫ్యాన్ అన్న‌ది ఆయ‌న మ‌న‌సులో ప్రింట్ అయ్యేలా పోసాని చెప్పార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.