Begin typing your search above and press return to search.

రెండెక‌రాల భూమి కోసం స్టార్లు కాళ్లు ప‌డ‌తారా?!

By:  Tupaki Desk   |   7 Sep 2020 2:10 PM GMT
రెండెక‌రాల భూమి కోసం స్టార్లు కాళ్లు ప‌డ‌తారా?!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ డివైడ్ ఫ్యాక్ట‌ర్ టాలీవుడ్ లో ఎన్నో కొత్త వివాదాల్ని తెర‌పైకి తెచ్చింది. టాలీవుడ్ ఎటెళ్లాలి? ఏపీ సినీపెద్ద‌ల‌ ప్రాధాన్య‌త ఎక్కువగా ఉన్న ఈ ప‌రిశ్ర‌మ వైజాగ్ కి త‌ర‌లి వెళ్లిపోతుందా? అంటూ ముచ్చ‌టించుకున్నారు. ఆ త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వం భూమిలిచ్చి ఎంక‌రేజ్ చేయ‌క‌పోవ‌డంతో సినిమా వాళ్లు ఎటూ వెళ్ల‌లేదు. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అలానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని క‌లిసారు సినీపెద్ద‌లు. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ అభ్యున్న‌తి కోసం చ‌ర్చించే ప్ర‌య‌త్నాలు సాగాయి. అటు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి స‌హా నాగార్జున‌.. సురేష్ బాబు త‌దిత‌ర పెద్ద‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టాలీవుడ్ ఏర్పాటును గురించి చ‌ర్చ సాగించార‌ని ప్ర‌చార‌మైంది.

అయితే ఈ మీటింగుల‌కు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌హా మోహ‌న్ బాబు వంటి పెద్ద‌ల్ని ఆహ్వానించ‌క‌పోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఆ ఇద్ద‌రూ ప‌లు సంద‌ర్భాల్లో త‌మ‌ను ఆహ్వానించ‌కుండానే ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని క‌ల‌వ‌డ‌మేమిటో అని వ్యాఖ్యానించారు. బాల‌య్య బాబు అయితే ప్ర‌భుత్వ భూసంతర్ప‌ణ రియ‌ల్ ఎస్టేట్ కోస‌మేనా? అని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు. రియ‌ల్ వ్యాపారం కోసం ప్ర‌భుత్వాల్ని క‌లుస్తారా? అని ప్ర‌శ్నించారు.

తాజాగా ఈ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌నాల ద‌ర్శ‌క‌ర‌చ‌యిత కం న‌టుడు పోసాని ముర‌ళి కృష్ణ మ‌రోసారి చ‌ర్చించారు. అప్పుడు మాట్లాడ‌డం ఇష్టం లేదు! అంటూనే సినీపెద్దల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన చిరంజీవి- నాగార్జున లాంటి వారికి భూములు అవ‌స‌ర‌మా? బాల‌య్య కామెంట్ల‌పై స్పందించ‌క‌పోవ‌డ‌మే మంచిదైంది కానీ.. అంటూనే.. డ‌బ్బు పేరున్న కోటీశ్వ‌రులు రెండెక‌రాల కోసం ప్ర‌భుత్వ పెద్ద‌ల కాళ్లు ప‌ట్టుకునే ప‌రిస్థితిలో ఉన్నారా? అని నిల‌దీసారు.