Begin typing your search above and press return to search.

లక్ష్మీ బాయ్ అంటే క్లబ్ డ్యాన్సర్ కాదు

By:  Tupaki Desk   |   7 Aug 2017 11:20 AM IST
లక్ష్మీ బాయ్ అంటే క్లబ్ డ్యాన్సర్ కాదు
X
''ఝాన్సీ లక్ష్మీ బాయ్ అంటే రంగీలా సినిమాలో యాయిరే పాటకు డ్యాన్సు వేసే హీరోయన్ కాదు. లేదంటే క్లబ్ డ్యాన్సర్ కాదు. అతను అలా అనుకుంటున్నాడేమో'' అంటూ నిప్పులు చెరిగాడు పోసాని కృష్ణ మురళి. ఈ ప్రముఖ రచయిత అవతలి వారు ఎంత పెద్దోళ్ళు అయినప్పటికీ వారిని చీల్చి చెండాడేయడంలో నిష్ణాతుడు. మాటలను తూటాలుగా చేసుకుని ఎక్కుపెట్టేస్తాడంతే. అవి తగిలినా తగలకపోయినా అతనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆ తూటాలను అసలు ఇలాంటి ఆయుధాలకే దాదా అయిన రామ్ గోపాల్ వర్మపై ఎక్కుపెట్టాడు.

ఆ మధ్యన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఛార్మిని ఉద్దేశించి ఒక కామెంట్ చేశాడు. అసలు ఛార్మి వెళ్లి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ముందు వెళ్ళి డ్రగ్స్ కేస్ ఉదంతంలో విచారణకు హాజరైనప్పుడు ఒక మాటన్నాడు. ఇప్పుడు తనకు హీరోయిన్ ఛార్మి స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీ బాయ్ తరహాలో కనిపిస్తోందని.. ఆమె అప్పట్లో బ్రిటీష్ సేనలను ఎదుర్కొన్నట్లే ఇప్పుడు ఛార్మి కూడా ఎదుర్కొంటోందని అన్నాడు. తరువాత మాట మారుస్తూ.. అసలు ఝాన్సీ కాలంలో ఇండియా అనే కాన్సెప్టే లేదని.. కాబట్టి ఆమెను ఫ్రీడమ్ ఫైటర్ అనకూడదని.. తన రాజ్యం కోసం తాను పోరాడిందని చెప్పాడు. ఈ కామెంట్లపై ఆల్రెడీ జనాలు నిప్పులు చెరిగేశారులే. ఇప్పుడు దీనిపైనే పోసాని కూడా ఫైర్ అయ్యాడు. ఝాన్సీ గురించి తెలియని వారే అలా మాట్లాడతారని చెప్పాడు.

ఏదేమైనా కూడా డ్రగ్స్ కేస్ టాలీవుడ్ ను కుదిపేస్తున్న వేళ.. దాదాపు అందరూ సిట్ వారిని తప్పుబడుతున్న వేళ.. పోసాని మాత్రం సిట్ ను వెనకేసుకొచ్చాడు. అసలు వాళ్ళు ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదని.. తీసుకునుంటే మాత్రం ఒక్కొక్కరినీ సీన్ వేరేలా ఉండేదని కామెంట్ చేశాడు. కొంపతీసి 2019 ఎన్నికల్లో తెలంగాణలోని హైదరాబాదులో ఏదన్నా టిక్కెట్ ఆశిస్తున్నావా పోసాని?