Begin typing your search above and press return to search.

పెళ్లి కాకూడ‌ద‌ని స్కెచ్ వేసారు..వాళ్ల కోసం క‌త్తి కూడా కొన్నా! పోసాని

By:  Tupaki Desk   |   20 Feb 2023 9:00 PM GMT
పెళ్లి కాకూడ‌ద‌ని స్కెచ్ వేసారు..వాళ్ల కోసం క‌త్తి కూడా కొన్నా! పోసాని
X
ర‌చ‌యిత‌...న‌టుడు..ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పోసాని మ‌ల్టీట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ. అందులోనూ న‌టుడిగా ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్ల‌లో పోసాని ఒక‌రు. అయితే ఇండ‌స్ర్టీలో ఎదిగే క్ర‌మంలో పోసానికి వ్య‌క్తిగ‌తంగా ఓ కుటుంబం టార్గెట్ చేసిన‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు.

అత‌నికి పెళ్లి కాకుండా ఒంట‌రి వాడిని చేయాల‌ని కొంత మంది పంతం ప‌ట్టిమ‌రి స్కెచ్ వేసిన‌ట్లు ఆయ‌న మాట్లో అర్ద‌మ‌వుతోంది. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

'నేను బాగా చుదువుకున్నాను. రేపో..మాపో మంచి ఉద్యోగంలో స్థిర‌ప‌డ‌తాను. దీంతో నాకు పిల్ల‌ని ఇవ్వ‌డానికి కొంత మంది ముందుకొచ్చారు. రైట‌ర్ గా అవ‌కాశాలు లేక‌పోయినా బ్ర‌త‌క‌గ‌ల‌డు అనే భ‌రోసాతోనే నాకు పిల్ల‌నివ్వ‌డానికి వాళ్లంతా ముందుకొచ్చారు.

నేను పద్ధతిగా ఉండేవాడిని .. ఎవరినీ ఒక్క కామెంట్ కూడా చేసేవాడిని కాదు. వివాదాల‌కు దూరంగా ఉండేవాడిని. ఇవ‌న్నీ తెలిసిన ఓ కుటుంబం నాకు పిల్ల‌నివ్వ‌డానికి వ‌చ్చారు.

వాళ్ల‌కి నా గురించి ఓ ఫ్యామిలీ చెడుగా చెప్పారు. దీంతో వాళ్ల మాట‌ల్ని న‌మ్మి వ‌చ్చిన వాళ్లు వెన‌క్కి వెళ్లిపోయారు. దీంతో జ‌ర‌గాల్సిన ఆ పెళ్లి ఆగిపోయింది. వాళ్లు నా గురించి బయట చెప్పే మాటలు ఏమిటనేది నాకు తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. గొడ‌వ ప‌డటం ఎంత సేపు. కానీ అది సంస్కారం కాదు.

కానీ ఒక దశలో మాత్రం ఓపిక నశించింది. అప్పుడే ఓ కత్తి కొని పుస్తకంలో' పెట్టుకున్నా ను' అని చెప్పుకొచ్చారు. కానీ క‌త్తి ఏ ఫ్యామిలీ కోసం కొన్నారో? ఆ సంగ‌తి మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం పోసాని సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లోనూ బిజీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే వైకాపా ఆయ‌న‌కు కీల‌క ఓ ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.