Begin typing your search above and press return to search.

RRR ఆలియాకు పాజిటివ్ రిపోర్ట్.. అమితాబ్ కి క‌రోనా టీకా!

By:  Tupaki Desk   |   2 April 2021 4:30 AM GMT
RRR ఆలియాకు పాజిటివ్ రిపోర్ట్.. అమితాబ్ కి క‌రోనా టీకా!
X
RRR బ్యూటీ అలియా భట్ కి కరోనావైరస్ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని తేలింది. ప్రియుడు రణబీర్ కపూర్ ఇటీవ‌లే మ‌హమ్మారీ నుండి కోలుకున్న కొన్ని రోజులకు ఆలియాకు పాజిటివ్ వ‌చ్చింది. నిజానికి ర‌ణ‌బీర్ కి పాజిటివ్ అని తేలినా త‌న‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని ఆలియా ఇంత‌కుముందు ప్ర‌క‌టించాయి. కానీ ఇప్పుడు పాజిటివ్ అని తేల‌డం అభిమానుల్లో క‌ల‌క‌లం రేపుతోంది. త‌న‌కు పాజిటివ్ అని ఆలియా స్వ‌యంగా ఇన్ ‌స్టాగ్రామ్ పోస్ట్ ‌లో ధృవీకరించారు

ప్ర‌స్తుతం ఆలియా స్వీయ గృహ‌‌ నిర్బంధంలో ఉన్నారు. ``నా వైద్యుల సలహా మేరకు నేను అన్ని భద్రతా నియ‌మాల్ని అనుసరిస్తున్నాను. మీ ప్రేమ మద్దతుకు ధ‌న్య‌వాదాలు`` అని ఆలియా అన్నారు. దయచేసి సురక్షితంగా ఉండండి..జాగ్రత్తలు పాటించండి.. అని ఇన్ స్టాలో కోరారు.

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి గంగూభాయి క‌తియావాడీ షూటింగ్ లో పాల్గొన్న‌ అలియా భట్ ఇంతకుముందు కోవిడ్ -19 పరీక్షలు చేయగా నెగెటివ్ అని తేలింది. భన్సాలీ ఆమె ప్రియుడు రణబీర్ కపూర్ ఈ వ్యాధి బారిన పడ్డాక ఆలి‌యాకు టెస్టులు చేసినా నెగెటివ్ వ‌చ్చింది. కొంత గ్యాప్ త‌ర్వాత పాజిటివ్ అని తేల‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇక మ‌రో బాలీవుడ్ ప్ర‌ముఖుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ ని స్వీక‌రించారు. అభిషేక్ బచ్చన్ మినహా కుటుంబ సభ్యులందరికీ కరోనావైరస్ వ్యాక్సిన్ మొదటి మోతాదు పూర్త‌యింద‌ని 78 ఏళ్ల‌ అమితాబ్ చెప్పారు. ``టీకా వేశారు... అంతా బాగానే ఉంది ... నిన్న నా కుటుంబానికి.. సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేశారు.. ఈ రోజు ఫలితాలు వచ్చాయి ... అన్నీ బాగున్నాయి. అన్నీ నెగటివ్ ... కాబట్టి టీకా వేశారు`` అని అమితాబ్ బచ్చన్ సోష‌ల్ మీడియాల్లో తాజాగా వెల్ల‌డించారు.

టీకా తీసుకునే మొత్తం విధానానికి వివరణాత్మకంగా ప్రత్యేకమైన బ్లాగ్ అవసరం అని అమితాబ్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. ఇక త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ఆన్ లొకేష‌న్ ఉండ‌డం వ‌ల్ల టీకా వేయించుకోవ‌డం కుద‌ర‌లేద‌ని తెలిపారు. గత సంవత్సరం అమితాబ్ బచ్చన్.. అభిషేక్ బచ్చన్..ఐశ్వర్య రాయ్ బచ్చన్ .. అమితాబ్ మనవరాలు ఆరాధ్య బచ్చన్ కరోనావైరస్ పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆస్ప‌త్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.