Begin typing your search above and press return to search.
పద్మావత్ లో రగిలిపోయేంత సీన్లు లేవట
By: Tupaki Desk | 24 Jan 2018 5:50 AM GMTసినిమా ప్రకటన మొదలు షూటింగ్ వరకూ రచ్చ రచ్చగా మారటమే కాదు.. సినిమా విడుదల విషయంలో సుదీర్ఘకాలంగా లొల్లి సాగుతున్న పద్మావత్ మూవీ రివ్యూలు వచ్చేశాయ్. ఈ చిత్రంపై పలు ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వెబ్ సైట్లు రివ్యూలు పెట్టేశాయి.
వివాదాలతో సినిమా తీశారని.. ఈ సినిమాతో తమ మనోభావాలు భారీగా దెబ్బ తింటాయని ఆందోళన చెందటం.. సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగలబెట్టేస్తామని వార్నింగ్ లు ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. సినిమాను రిలీజ్ చేస్తే.. ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల ముందు తాము ఆత్మాహుతి చేసుకుంటామని 2వేల మంది మహిళలు తమ పేర్లును ఇవ్వటంతో ఈ ఇష్యూ మరింత ముదిరిపోయింది.
ఓపక్క ఈ మూవీని ప్రివ్యూ షోలు వేస్తున్న థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకుంటున్న వేళ.. ఈ సినిమా ప్రివ్యూ టాక్ బయటకు వచ్చేసింది. ఇంతకాలం ఈ సినిమా మీద సాగిన చర్చకు.. ఈ సినిమాలో ఉన్న దానికి పోలిక లేదని చెబుతున్నారు.
ఈ మూవీలో రచ్చ చేసేంత వివాదాస్పదమైన అంశాలు ఏమీ లేవని పలు రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ఎప్పటి మాదిరే భన్సాలీ గ్రాండియర్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని.. దీపిక తన కళ్లతోనే మేజిక్ చేసిందని చెబుతున్నారు. ఈ సినిమాలో భావోద్వేగ అంశాల విషయంలో వెనుకబడి ఉందని.. మొత్తంగా సినిమా ఓకే అన్న మాటను ప్రివ్యూ టాక్ స్పష్టం చేస్తుంది. మరి.. వివాదాస్పద అంశాలు లేని వేళ.. రచ్చ చేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కాని పరిస్థితి.