Begin typing your search above and press return to search.

పుష్ప‌కు త‌మిళం మ‌ల‌యాళంలో పాజిటివిటీ

By:  Tupaki Desk   |   19 Dec 2021 7:55 AM GMT
పుష్ప‌కు త‌మిళం మ‌ల‌యాళంలో పాజిటివిటీ
X
ఇటీవ‌లి కాలంలో సినిమా రిజ‌ల్ట్ ని రివ్యూలు చాలావ‌ర‌కూ నిర్ధేశిస్తున్నాయి. అయితే భాష‌ను బ‌ట్టి ప్ర‌జ‌ల సెన్సిబిలిటీస్ ని బ‌ట్టి సినిమాలు హిట్ట‌వుతుంటాయి. తాజాగా విడుద‌లైన పుష్ప కి తెలుగులో నెగెటివ్ రివ్యూలు వ‌చ్చినా త‌మిళం-మ‌ల‌యాళంలో ఆ స‌మ‌స్య లేక‌పోవ‌డం ఇంట్రెస్టింగ్.

పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`కు తెలుగులో రివ్యూలు నెగిటివ్ గా వ‌చ్చాయి. భారీ అంచ‌నాల న‌డుమ‌ రిలీజైన ఈ సినిమా 3- ప్ల‌స్ రేటింగ్ తో దూసుకుపోతుంద‌ని రిలీజ్ కు ముందు బోలెడ‌న్ని అంచ‌నాలేర్ప‌డినా కానీ రివ్యూలు నిరాశ‌ప‌రిచాయి. ఇది ఊహించ‌ని పరిణామం. ఓ ర‌కంగా చెప్పాలంటే `వ‌న్` సినిమా విష‌యంలో ఏదైతే జ‌రిగిందో..అదే స‌న్నివేశం `పుష్ప` విష‌యంలోనూ రిపీటైంది. శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా శ‌నివారం వ‌ర‌కూ వ‌సూళ్లు బాగానే ఉన్నాయి.

టాక్ ప‌రంగా నెగిటివిటీ వ‌స్తోంది గానీ బ‌న్నీ మాస్ ఇమేజ్ జ‌నాల్ని థియేట‌ర్ కి ర‌ప్పించ‌గ‌లుగుతోంది. ఆదివారం హాలీడే కాబ‌ట్టి థియేట‌ర్లు అన్ని హౌస్ ఫుల్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప‌ అస‌లు రంగు ఏమిట‌న్న‌ది సోమ‌వారం నుంచి బ‌య‌టప‌డ‌నుంది. ప్ర‌స్తుతానికి పోటీగా ఏ చిత్రం లేక‌పోవ‌డం పుష్ప‌కి సానుకూల అంశ‌మే. ఇక హిందీలోనూ పుష్ప అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. అయితే తెలుగు-హిందీ వెర్ష‌న్ల‌కు భిన్నంగా త‌మిళం.. మ‌ల‌యాళం భాష‌ల్లో మాత్రం పుష్ప‌కి మంచి రివ్యూలు వ‌చ్చాయి. దాదాపు అన్ని వెబ్ సైట్లు 3 రేటింగ్ ఇచ్చాయి. అక్క‌డ పెయిడ్ రేటింగ్ ల‌కు ఆస్కారం లేదు కాబ‌ట్టి జెన్యూన్ హిట్ గానే భావించొచ్చు.

ఆ రెండు భాష‌ల్లో ఇలాంటి మాస్ కంటెంట్ .. వాస్త‌విక స‌న్నివేశాలు.. ఫారెస్ట్ నేప‌థ్యంతో వ‌చ్చే సినిమాలు సులువుగా క‌నెక్ట్ అవుతాయి అన‌డానికి ప్రూఫ్ లున్నాయి. `పుష్ప` త‌ర‌హా ర‌గ్ డ్ ర‌స్టిక్ క‌థాంశాలకు కోలీవుడ్ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌డ‌తారు. సాధార‌ణంగా తెలుగు హీరోల్ని త‌మిళులు తొంద‌ర‌గా ఎంక‌రేజ్ చేయ‌రు. కానీ `పుష్ప` విష‌యంలో బ‌న్నీని వాళ్లంతా ప్రోత్స‌హించిన‌ట్లే రివ్యూలు చెబుతున్నాయి. అంటే `పుష్ప` కంటెంట్ కోలీవుడ్ కి అంత‌గా క‌నెక్ట్ అయింద‌ని చెప్పొచ్చు. ఈ రెండు భాష‌ల నుంచి పుష్ప‌కి మొద‌టి రోజు మంచి వ‌సూళ్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి సౌత్ ఇండియాలో బ‌న్నీ జెండా పాతేసిన‌ట్లుగా భావించొచ్చు. తెలుగు ఆడియెన్ నుంచి ఆరంభ వ‌సూళ్లు బావున్నాయి. లాంగ్ ర‌న్ ఉన్నా లేక‌పోయినా అటు త‌మిళం.. మ‌ల‌యాళం నుంచి వ‌చ్చే స‌క్సెస్ పుష్ప‌కు ప్ర‌ధాన‌ అస్సెట్ అవుతుందని భావించాలి. మాలీవుడ్ లో మ‌ల్లూ అర్జున్ హ‌వా మ‌రోసారి కొన‌సాగుతుండ‌డం ఇక్క‌డ పెద్ద పాజిటివిటీ.