Begin typing your search above and press return to search.
పవన్ కు గండికొట్టిన మిత్రుడు
By: Tupaki Desk | 2 April 2017 3:33 PM GMTమామూలుగా అయితే పవన్ కళ్యాణ్ సినిమా అంటే మిగతా చిత్రాలు భయపడాల్సిందే. పవర్ స్టార్ సినిమా వల్ల మిగతా వాటికే దెబ్బ తగులుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’కు వెంకటేష్ సినిమా ‘గురు’ గండి కొడుతోంది. ‘కాటమరాయుడు’ వచ్చిన వారం తర్వాత థియేటర్లలోకి దిగిన ‘గురు’.. పవన్ సినిమాకు గట్టి పంచే ఇస్తోంది.
మంచి టాక్ తెచ్చుకున్న ‘గురు’ అందుకు తగ్గట్లే వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు ఉదయం కలెక్షన్లు ఓ మోస్తరుగా ఉన్నా ఫస్ట్ షో నుంచి పుంజుకున్నాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. శనివారం కూడా వసూళ్లు స్టడీగా ఉండగా.. ఆదివారం మరింత పెరిగాయి. తొలి మూడు రోజుల్లో ‘గురు’కు అత్యధిక వసూళ్లు వచ్చింది ఆదివారమే అంటున్నారు. ఈ రోజులు అన్ని ఏరియాల్లోనూ సినిమా హౌస్ ఫుల్స్ తో ఆడిందట. తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లకు పైగా షేర్ వచ్చి ఉంటుందని అంచనా. ‘గురు’ దెబ్బకు కాటమరాయుడు వసూళ్లపై బాగానే ప్రభావం పడింది.
ఫస్ట్ వీకెండ్ అవ్వగానే ‘కాటమరాయుడు’ వసూళ్లలో బిగ్ డ్రాప్ కనిపించింది. ఐతే బుధవారం ఉగాది సెలవు కావడంతో వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. వీకెండ్లో కూడా ఇదే మాదిరి వసూళ్లు వస్తే నష్టాలు కొంత మేర తగ్గుతాయని ఆశించారు. కానీ ఆ ఆశలకు గురు గండికొట్టినట్లే ఉంది. వీకెండ్ అయినా ‘కాటమరాయుడు’కు థియేటర్లు నిండలేదు. ఆక్యుపెన్సీ అనుకున్న స్థాయిలో లేదు. దీంతో ‘కాటమరాయుడు’ నష్టాలు అనుకున్నదానికంటే ఎక్కువే ఉంటాయని భావిస్తున్నారు. కనీసం పాతిక కోట్ల దాకా నష్టం తప్పేలా లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/