Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ లతా మంగేష్కర్ పై పోస్టల్ స్టాంప్

By:  Tupaki Desk   |   8 Feb 2022 2:42 AM GMT
లెజెండ‌రీ లతా మంగేష్కర్ పై పోస్టల్ స్టాంప్
X
లెజెండ‌రీ గాయ‌ని లతా మంగేష్కర్ పై పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. ల‌తాజీ గౌరవార్థం పోస్టల్ స్టాంపును ప్రవేశపెట్టేందుకు కేంద్రం అంగీకరించింది. ఇండియా టుడే బడ్జెట్ రౌండ్ టేబుల్ లో భారత రైల్వేలు- కమ్యూనికేషన్లు -ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ స్టాంప్ `నైటింగేల్ ఆఫ్ ఇండియా`కి తగిన గౌరవం అని అన్నారు.

ముద్ర స్మారక స్టాంపుగా దీనిని విడుద‌ల చేస్తాం. భారత తపాలా శాఖ ప్రకారం, .. స్మారక స్టాంపులు ముఖ్యమైన సంఘటనలు,.. వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు,.. ప్రకృతి లక్షణాలు,.. అందమైన లేదా అరుదైన వృక్షజాలం -జంతుజాలం,.. పర్యావరణ సమస్యలు,.. వ్యవసాయ కార్యకలాపాలు,.. జాతీయ/అంతర్జాతీయ సమస్యలు, ..ఆటలు మొదలైన వాటిని స్మరించుకుంటూ విడుదల చేస్తారు.

స్టాంపులు ఫిలాటెలిక్ బ్యూరో .. కౌంటర్లలో లేదా ఫిలాటెలిక్ డిపాజిట్ ఖాతా పథకం క్రింద మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి పరిమిత పరిమాణంలో ముద్రించబడతాయి. వ్యక్తిత్వాలపై స్టాంపులు వార్షిక ఇష్యూ ప్రోగ్రామ్ లో 10శాతం మించకూడదు. పోస్ట‌ల శాఖ మార్గదర్శకాలను ప‌రిశీలిస్తుంది.

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6 ఆదివారం నాడు నింగికేగిన సంగ‌తి తెలిసిందే. కోవిడ్-19 పాజిటివ్ అని తెలిసాక‌ ఆమె జనవరి 8న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరారు. ఆమె గత రెండు వారాలుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స తీసుకుంటున్నారు. ప‌రిస్థితి విష‌మించి మృతి చెందారు. దాదాపు 35 భాష‌ల్లో30 వేల పాట‌లు పాడిన ఏకైక గాన‌కోకిల‌గా ల‌తాజీ చ‌రిత్ర‌కెక్కారు. గిన్నిస్ రికార్డుల్లోనూ ల‌తా మంగేష్క‌ర్ పేరు లిఖిత‌మైంది. భార‌త‌ర‌త్న‌- దాదాసాహెబ్ ఫాల్కే- ప‌ద్మ‌విభూష‌ణ్- ప‌ద్మ‌భూష‌ణ్ వంటి అత్యున్న‌త పుర‌స్కారాల్ని ల‌తాజీ ద‌క్కించుకున్నారు.