Begin typing your search above and press return to search.
ఫాంటమ్ పోస్టర్ కూడా కాపీయేనా.. ఛ..
By: Tupaki Desk | 25 July 2015 4:00 PM GMTమన దేశంపై జరిగిన ముంబయ్ ఉగ్రవాద దాడులను నేపథ్యంగా చేసుకొని ఒక సరిక్రొత్త స్టోరీతో ''ఫాంటమ్'' అనే సినిమాను రూపొందిస్తున్నాడు కబీర్ ఖాన్. అంటే ఇది దేశ భక్తితో కూడిన సినిమా అనే మనోళ్ళ ఫీలింగ్. ఈ సినిమా పోస్టర్ల లో కత్రిన, సైఫ్ ఇద్దరికీ కళ్లు కప్పేశారు. ఓ జాతీయ జెండాని చుట్టేసి చాలా క్రియేటివిటీనే చూపించారు. దీనికి జనాల నుంచి చక్కని ప్రశంసలొచ్చాయి.
అయితే ఇలా ప్రశంసలొచ్చిన 24 గంటల్లోనే కాపీ పోస్టర్ అంటూ కొన్ని పోస్టర్ల తో ఎటాక్ చేశారు నెటిజన్స్. ఈ సినిమా పోస్టర్లు ''హోమ్ ఫ్రంట్'' అనే హాలీవుడ్ పోస్టర్ కి కాపీ. అక్కడ కూడా ఓ జాతీయ జెండాని కళ్లకు కప్పేసుకున్న హీరో కనిపించాడు. దిస్ ఈజ్ టూమచ్ అంటున్నారంతా. భజరంగి తో హిట్ కొట్టిన కబీర్ ఖాన్ ఇప్పుడిలా కాపీ క్యాట్ అని ముద్ర వేయించుకోవడం హస్యాస్పదం అంటున్నారంతా. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వాళ్లు, బాలీవుడ్ నుంచి మిగతా ఉడ్లు కాపీలు కొట్టేయడం షరా మామూలే. పోస్టర్ల నుంచి వీడియోల వరకూ ఇప్పటికే చాలా కాపీలు బహిరంగంగా తెలిసిపోయి. వాటి వలన పరువు పోయింది కూడా. చివరకు ఫాంటమ్ వంటి సినిమా కూడా అదే చేయాలా?
గతంలోనే బాంబే వెల్వెట్ పోస్టర్ విషయంలో ఇలానే జరిగింది. గాన్ విత్ ది విండ్ అనే హాలీవుడ్ సినిమా పోస్టర్ ఇన్‌స్పిరేషన్ అని తేలిపోయింది. బద్లాపూర్ పోస్టర్లు చూసి 300, ఇన్‌సెప్షన్ కి కాపీ అంటూ విమర్శలు తలెత్తాయి. చివరకు బాహుబలి సినిమాకు చెందిన చేతిలో బుడ్డోడు పోస్టర్ కూడా సైమన్ బిర్చ్ అనే సినిమా పోస్టర్ చూసి కాపీ కొట్టారనే అందరూ చెప్పుకొచ్చారు. ఏదైమనా మచ్చ మచ్చే. మన మేకర్లు అవి పడకుండా చూసుకుంటే మంచింది.