Begin typing your search above and press return to search.
ఇది కూడా కాపీయే అంటున్నారు సామీ!!
By: Tupaki Desk | 4 Sep 2017 9:28 AM GMTసాధారణంగా చాలా సినిమాల విషయంలో ఎక్కడో చోట ఏదో ఒక ఇన్ స్పిరేషన్ ఉంటూనే ఉంటుంది. సాక్షాత్తూ రాజమౌళి అంతటి వాడే.. బాహుబలి పాదాన్ని కట్టప్ప తన నెత్తిపై పెట్టుకునే సీన్ ఒక ఇంగ్లీష్ టివి సిరీస్ లో నుండి కాపీ చేశాడు. అయితే ఎలా కాపీ కొట్టారన్నది కాదు.. అసలు ఆ కాపీ చేసిన సీన్ ఇక్కడ నప్పేలా ఎలా తీశారన్నదే ముఖ్యం. ఎందుకంటే యాజిటీజ్ ఎత్తేసిన సినిమాలు ఎన్నో ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి. ఇక ఈ కాపీ సినిమా కథలకు.. సీన్లకు.. మ్యూజిక్ డైరక్టర్లు ఇచ్చే ట్యూన్లకే కాదు.. ఇప్పుడు పోస్టర్లకు కూడా వర్తిస్తోంది.
మొన్నటికిమొన్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా #PSPK25 కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరును ఇంకా రివీల్ చేయకపోయినా కూడా.. సినిమా కాన్సెప్ట్ అనేది ఒక పోస్టర్ తో చెప్పాలని ప్రయత్నించారు. అయితే ఆ పోస్టర్లో అర్దమైంది తక్కువే కాని.. పవన్ కళ్యాణ్ ఏదో తీక్షణంగా ఆలోచిస్తే.. ఆయన మదిలో మెదులుతున్న ఆలోచనలు కలల్లో కదులుతున్నాయి అన్న చందాన డిజైన్ ఉంది. ఇప్పుడు హిందీలో మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'రుఖ్' పోస్టర్ కూడా దీనికి దగ్గరగా ఉండటంతో.. నెటిజన్లు ఇది కాపీ కాపీ అంటున్నారు.
నిజానికి ఈ తరహా డిజైన అనేది కాపీ అనే అనకూడదు. ఎందుకంటే ఒక మనిషి ఏదో ఆలోచిస్తున్నాడు అని చెప్పడానికి.. మనోళ్ళు అలా ఒక బొమ్మలో ఇంకో బొమ్మ ఉన్నట్లు విజువలైజ్ చేస్తుంటారు. అదొక స్టయిల్. ప్రతీ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలోనూ నేర్పించే ఒక డిజైన్ ఫార్మాట్. కాబట్టి ఈ రెండు పోస్టర్లూ అదే థీమ్ తో డిజైన్ చేశారే కాని.. కాపీ కొట్టేసుకున్నారు అని అనకూడదేమో. అది సంగతి.