Begin typing your search above and press return to search.

మెగాస్టార్ పై జోక్ చేస్తూ.. వైసీపీ నేత సంచలన ట్వీట్

By:  Tupaki Desk   |   23 April 2020 3:00 PM GMT
మెగాస్టార్ పై జోక్ చేస్తూ.. వైసీపీ నేత సంచలన ట్వీట్
X
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పై వైసీపీ నేత పొట్లూరి వీర ప్రసాద్ సంచలనమైన ట్వీట్ చేశారు. బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ లో భాగంగా నేడు చిరంజీవి ఇంటి పనులు చేస్తూ పెసరట్టు వేసి ఛాలెంజ్ ని పూర్తిచేసినట్లు వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన వైసీపీ నాయకుడు పొట్లూరి వీర ప్రసాద్ మెగాస్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీవీపీ స్పందిస్తూ.. ‘చిరంజీవి గారు - మీరు ఇంట్లో అంట్లు తోమగలం - ఇల్లు తుడవగలం అని నిరూపించడంతో పాటు స్టార్ చెఫ్ లాగా వంట కూడా చేస్తుంటే.. మా ఇంట్లో ఆడవాళ్లు కూడా మమ్మల్ని చేయమంటున్నారు. మెగాస్టార్ గారే చేయగా.. మీరు చేయలేరా అని అడుగుతున్నారంటూ.. మా పచ్చని సంసారంలో నిప్పులు పోయకండి సార్' అంటూ పీవీపీ ట్వీట్ చేశారు. అనంతరం ఊరికే అన్నానని.. ఎందరికో ఆదర్శవంతులైన మిమ్మల్ని అందరూ అభినందిస్తారంటూ తెలిపారు. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట చర్చగా మారింది.

అంతేగాక పీవీపీ పోస్టుకు చిరు వీడియోను కూడా ట్యాగ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన సవాల్‌ ను స్వీకరించిన చిరంజీవి ఈరోజే ఉదయం బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేశారు. ఇంటి పనులు చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాక్యూమ్ క్లీనర్‌ తో ఇళ్లంతా క్లీన్ చేసి కిచెన్‌ లో టిఫిన్ తయారు చేశారు. పెసరట్టు వేసి తన తల్లి అంజనా దేవికి అందించారు. అయితే కొడుకు తీసుకొచ్చిన టిఫిన్‌ ను చూసి తల్లి మురిసిపోయి.. ప్రేమగా మొదటి ముద్ద కొడుకుకే తినిపంచారు. డైనింగ్ టేబుల్ వద్ద తల్లితో ముచ్చట్లు చెబుతూ నవ్వుతూ ఉన్న వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్టు చేశారు. ఈ వీడియో మెగాస్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనంతరం చిరు సంగీత దర్శకుడు మణిశర్మ - సూపర్ స్టార్ రజనీకాంత్ - తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ లకు సవాల్ విసిరారు.