Begin typing your search above and press return to search.

జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్?

By:  Tupaki Desk   |   24 Oct 2019 12:58 PM GMT
జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్?
X
కొన్ని సినిమాలకు సీరియల్ లాగా టీజర్లు.. వరసగా ట్రైలర్లు రిలీజ్ చేసినా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేవు. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఒక్క టీజర్ లేదా ట్రైలర్ చాలు.. ఇక ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా ఆ సినిమాను ఎలాగైనా చూడాలని ప్రేక్షకులకు అనిపిస్తుంది. 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలే అలాంటివి. రీసెంట్ గా 'జార్జ్ రెడ్డి' ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.

'జార్జ్ రెడ్డి' ట్రైలర్ లో ఉన్న ఇంటెన్సిటీ ఆ ట్రైలర్ ను ఎంతో పవర్ ఫుల్ గా కట్ చేసిన విధానం చాలామంది ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఎలా ఉంది అనేది రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు. అయితే ట్రైలర్ మాత్రం ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా ఈ ట్రైలర్ మెప్పించిందట. ఈ ట్రైలర్ పవన్ కు నచ్చడంతో దర్శకుడు జీవన్ రెడ్డిని అభినందించారట. ఒక గొప్ప విద్యార్థి నాయకుడి జీవితంపై సినిమా తీసినందుకు జీవన్ ను మెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమాకు అవసరమైతే ప్రమోషన్స్ విషయంలో సాయం చేస్తానని మాటిచ్చారట.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకావాల్సిందిగా 'జార్జ్ రెడ్డి' టీమ్ పవన్ కళ్యాణ్ ను కోరడంతో తప్పనిసరిగా హాజరవుతానని చెప్పారట. ట్రైలర్ రిలీజ్ తోనే 'జార్జ్ రెడ్డి'కి ట్రేడ్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పుడు పవర్ స్టార్ మద్దతు కూడా ఉంటే ఈ సినిమాకు భారీగా ప్రచారం దక్కుతుందనడంలో సందేహం లేదు. 'జార్జ్ రెడ్డి' నవంబర్ 22 న రిలీజ్ అవుతోంది.