Begin typing your search above and press return to search.

మల్టీ టాస్కింగ్ చేస్తున్న పవర్ స్టార్..!

By:  Tupaki Desk   |   2 March 2021 5:00 PM IST
మల్టీ టాస్కింగ్ చేస్తున్న పవర్ స్టార్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25 ఏళ్ల సినీ కెరీర్ లో 25 సినిమాలలో నటించాడు. అంటే యావరేజ్ గా ఏడాదికి ఒక సినిమా చేసాడు. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తుంటాడు కాబట్టే, పవన్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే అది ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎంత టైం పట్టుద్ది అనే దాని గురించి ఆలోచించకూడదని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఉండేది. ఇక 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టి కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యాడు. అయితే మళ్ళీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న పవన్.. వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా అర డజను సినిమాలకు ఒకే చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాడు. ఈ క్రమంలో ఒకేరోజు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నాడని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేయబడిన సెట్స్ లో జరుగుతోంది. అలానే దగ్గుబాటి రానాతో కలిసి 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ లో నటిస్తున్నాడు పవన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణలో సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శేరి లింగంపల్లి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ఈ రెండు సినిమాలను ప్యారలల్ గా చేస్తున్నాడు. అయితే ఈరోజు ఉదయం క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవర్ స్టార్.. షూట్ పూర్తైన వెంటనే 'ఏకే' రీమేక్ సెట్స్ లో జాయిన్ అయ్యాడట. ఇదే కనుక నిజమైతే పవన్ ఇలా ఓకేరోజు రెండు సినిమాల చిత్రీకరణలో పాల్గొనడం తొలిసారి అని చెప్పవచ్చు.