Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' ట్రైలర్ పై పవర్ స్టార్ మాజీభార్య.. ఏమందంటే??
By: Tupaki Desk | 1 April 2021 6:19 AM GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ నుండి సినిమా వస్తుండటంతో అభిమానులు ఓ రేంజిలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ట్రైలర్ విడుదలై టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ట్రైలర్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 30 మిలియన్స్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. ఇంతవరకు ఏ హీరో ట్రైలర్ కూడా ఒక్కరోజులో 20మిలియన్స్ దాటలేదని.. ఆ రికార్డు పవన్ క్రియేట్ చేసాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఐతే సినిమా పై వకీల్ సాబ్ ట్రైలర్ అంచనాలను మరో రేంజికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా.. తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్ పై ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ స్పందించారు. 'వకీల్ సాబ్ ట్రైలర్ చూసాను. లాయర్ పాత్రలో పవన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు చూడని లుక్కులో కనిపిస్తున్నారు. అమ్మాయిల తరపున పోరాడే న్యాయవాదిగా పవన్ క్యారెక్టర్ ఆటిట్యూడ్ బాగుంది. అలాగే చివరిలో అబ్బాయిని 'ఆర్ యూ వర్జిన్?' అని అడగటం చాలా బాగుందని.. ఖచ్చితంగా ఈ సినిమా అందరిని అలరిస్తుందని' రేణుదేశాయ్ అభినందించారు. దిల్ రాజు, బోణికపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిందీ పింక్ రీమేక్ కాగా.. నివేత థామస్, అంజలి, అనన్య కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.