Begin typing your search above and press return to search.
దిల్ రాజు గట్టెక్కేసారు సరే ఇతర నిర్మాతలు?
By: Tupaki Desk | 12 April 2021 3:30 AM GMTఇది గట్టు మీదున్న బెస్తవాడు.. నీటిలో ఉన్న చేప కథలా ఉంది. వలకు చిక్కితే చేప మటాషే. కానీ ఏదో ఒక రోజు చేప గట్టు మీదకు తూలాలి అన్నట్టే ఉంది సన్నివేశం. కరోనా క్రైసిస్ వేళ ఇప్పుడు సినిమాల్ని రిలీజ్ చేస్తే బెస్తవాని కి చిక్కిన చేప కథలా ఉంటుందేమో! అన్న సందిగ్ధత వెంటాడుతోంది.
సెకండ్ వేవ్ ప్రభావంతో థియేట్లర్లు మూసేస్తే క్రేజీగా రిలీజ్ కి వచ్చిన సినిమాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. ఆ భయంతోనే చాలా మంది నిర్మాతలు తమ సినిమాల్ని వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఇటీవలే ధైర్యం చేసి రిలీజ్ చేసినందుకు వకీల్ సాబ్ గట్టెక్కేసినట్టేనన్న టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు సేఫ్ అయిపోయారు. ఆయన సేఫ్ గేమ్ ఆడగలిగారు కానీ ఇతరుల వల్ల అవుతుందా? అన్న డౌట్ వ్యక్తమైంది.
ఇంకా చెప్పాలంటే వకీల్ సాబ్ కరెక్ట్ టైమ్ లో రిలీజైంది. ఇతర సినిమాలేవీ పోటీకి లేకపోవడం.. హిట్ టాక్ రావడం.. పవర్ స్టార్ మానియా ఇవన్నీ కలిసొచ్చి నిర్మాత దిల్ రాజు సేఫ్ అయిపోయారు. కానీ తరవాత వచ్చే పెద్ద సినిమాల సన్నివేశం ఏంటో.. ఇతర నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పట్లో అర్థం కావడం లేదు.
సెకండ్ వేవ్ ఉధృతం అవుతోంది. దీనివల్ల 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు రిస్ట్రిక్షన్స్ పెడితే తరవాత సినిమాల నిర్మాతలు అంతా తలలు పుట్టుకునే పరిస్థితి ఉంటుంది. కరెక్ట్ గా టాలీవుడ్ ట్రాక్ ఎక్కింది. బిజినెస్ బావుంది అనుకుంటే.. మళ్లీ ఈ సెకండ్ వేవ్ గోల ఏంటో అర్థం కావడం లేదన్న ఆవేదనా పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి దిల్ రాజు రిలీజ్ చేసిన పెద్ద మూవీ గట్టెక్కేసినట్టేనన్న టాక్ వినిపిస్తోంది.