Begin typing your search above and press return to search.
పోలీస్ పాత్రలపై మక్కువ చూపిస్తున్న పవర్ స్టార్..!
By: Tupaki Desk | 16 April 2021 8:31 AM GMT'వకీల్ సాబ్' తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఐదు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందుకు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోయే '#PSPK28' ప్రాజెక్ట్ ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని - రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పవన్ ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. అంతేకాదు ఇందులో ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఇంతకముందు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అలానే డైరెక్టర్ ఎస్.జె. సూర్యతో కలిసి చేసిన 'కొమరం పులి' సినిమాలో స్పెషల్ పోలీసాఫీసర్ గా నటించాడు. ఇక బాబీ దర్శకత్వంలో పవన్ స్టోరీ అందించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' లో కూడా ఆయనది పోలీస్ పాత్ర అనే విషయం తెలిసిందే. అలానే 'గుడుంబా శంకర్' సినిమాలో ఓ సీన్ లో ఖాకీ డ్రెస్ వేసుకొని అలరించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం నటిస్తున్న 'అయ్యప్పనమ్ కోషియం' తెలుగు రీమేక్ లో కూడా పవన్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు 'PSPK28' సినిమాలో కూడా ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.