Begin typing your search above and press return to search.
'శ్యామ్ సింగ రాయ్' నుంచి పవర్ ఫుల్ సాంగ్.. 'రైజ్ ఆఫ్ శ్యామ్'
By: Tupaki Desk | 6 Nov 2021 6:47 AM GMTనేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభం నుంచీ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఇటీవల 'టక్ జగదీష్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పలకరించిన నాని.. ఇప్పుడు ''శ్యామ్ సింగ రాయ్'' అనే హై ఓల్జేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. రాహుల్ సాంకృత్యన్ దీనికి దర్శకుడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ అంశాలను ముడిపెడుతూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. తాజాగా 'రైజ్ ఆఫ్ శ్యామ్' అనే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 'పుట్టిందా ఓ అక్షరమే.. కాగితపు కడుపు చీల్చే.. అన్యాయం తలే తెంచే.. అరే కరవాలంలా పదునా కలమేరా.. శ్యామ్ సింగ రాయ్' అంటూ సాగిన ఈ పాట శ్రీతలకు గూస్ బమ్స్ తెప్పించేలా సాగింది.
మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరు గాంచిన మిక్కీ జె మేయర్ ఈ పాటకు మంచి ట్యూన్ సమకూర్చారు. తెలుగు వెర్సన్ కు కృష్ణ కాంత్(కె.కె) సాహిత్యం అందించారు. 'అరే ఎగసెగిసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే..' అంటూ హీరో పాత్ర స్వభావం తెలియజేసెలా ఈ లిరిక్స్ సాగాయి. బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ - యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి కలిసి ఈ పాటను ఉర్రూతలూగించేలా ఆలపించారు. ఇందులో కిజ్జీ పాడిన బెంగాలీ ర్యాప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగు పాటలో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
శ్యామ్ సింగ రాయ్ అనే యువకుడు 1970 నాటి కలకత్తాలో ఒక లెజెండ్ గా ఎలా ఎదిగారు అనేది ఈ 'రైజ్ ఆఫ్ శ్యామ్' సాంగ్ లో చూపించారు. నాని బెంగాలీ వ్యక్తిగా కొత్త హెయిర్ స్టైల్ - డిఫరెంట్ మీసకట్టుతో కనిపిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్.. సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గేష్ అప్పటి కాలానికి తగ్గట్లుగా విజువల్స్ అందించారు. మొత్తం మీద ఈ పాట విశేషంగా అలరించడంతో పాటుగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు - మోషన్ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
'శ్యామ్ సింగరాయ్'' చిత్రంలో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నాని కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. సత్యదేవ్ జంగా ఈ చిత్రానికి కథ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫర్ వర్క్ చేస్తున్నారు.