Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ మూవీకి పవర్ఫుల్ టైటిల్!
By: Tupaki Desk | 2 Feb 2022 5:30 PM GMTఎన్టీఆర్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 25వ తేదీన విడుదల కానుంది. ఎన్టీఆర్ అభిమానులంతా ఆ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తుండగానే, ఆయన కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ బస్తీకి చెందిన యువకుడిగా కనిపించనున్నాడు. స్టూడెంట్ లీడర్ గా రాజకీనాయకులతో తలపడే పాత్ర ఇది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
ఇక ఆ తరువాత సినిమాను ఆయన 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సుకుమార్ తో ఎన్టీఆర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువల్లనే ఆయన శిష్యుడైన బుచ్చిబాబు సినిమాను చేయడానికి ఎన్టీఆర్ ఎంతమాత్రం ఆలోచన చేయలేదు. పైగా తొలి చిత్రమైన 'ఉప్పెన' సంచలన విజయాన్ని అందుకుని ఆయన టాలెంట్ కి అద్దం పడుతూనే ఉంది. అంతేకాదు బుచ్చిబాబు తయారు చేసిన కథ కూడా ఎన్టీఆర్ కి చాలా కొత్తగా అనిపించిందట. ఆయన ఒప్పుకోవడానికి అది ప్రధానమైన కారణమని అంటున్నారు.
ఈ కథ అంతా కూడా విలేజ్ నేపథ్యంలో .. కబడ్డీ ఆట చుట్టూ తిరుగుతుందట. ఈ సినిమా కి 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. టైటిల్ ఎన్టీఆర్ కి కూడా బాగా నచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
బుచ్చిబాబును చూస్తే ఆయనకి కాస్త బిడియం ఎక్కువనే విషయం అర్థమైపోతుంది. వేదికలపై చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా కథాకథనాలపై ఆయనకి మంచి పట్టు ఉందనే విషయం 'ఉప్పెన' సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమైపోతుంది. అయితే 'ఉప్పెన' సినిమా హీరో .. హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్లు. వాళ్లను హ్యాండిల్ చేయడం చాలా తేలిక. కానీ ఇక్కడ ఉన్నది ఎన్టీఆర్ .. పైగా పాన్ ఇండియా సినిమా. హీరో ఎన్టీఆర్ అంటే మిగతా ఆర్టిస్టులు కూడా అందుకు తగినట్టుగానే ఉంటారు. మరి ఈ బాధ్యతను బుచ్చిబాబు ఎలా మోస్తాడో .. ఏమో!