Begin typing your search above and press return to search.
కొత్త మెగా బేనర్.. హీరో-డైరెక్టర్ దొరికేశారు
By: Tupaki Desk | 10 March 2017 5:58 AM GMTరెండు రోజుల కిందటే గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్.. స్టూడియో గ్రీన్ సంస్థలు ఉమ్మడిగా ‘వి-4’ క్రియేషన్స్ పేరుతో ఒక కొత్త బేనర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్లో చిన్న-మీడియం రేంజి సినిమాలు తీయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మూడు సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ఒక సినిమా వివరాలు బయటికి వచ్చాయి. ఈ చిత్రంలో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా చేయబోతుండటం విశేషం. సీరియళ్లు.. టీవీ షోలతో పేరు తెచ్చుకున్న ‘ఈటీవీ’ ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతుండటం మరో విశేషం.
ప్రభాకర్ దర్శకుడు కావాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. అతను గీతా ఆర్ట్స్ లో కూడా కొంత కాలం తిరిగాడు. శిరీష్ హీరోగా సినిమా చేయడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. కొన్నాళ్ల పాటు గీతా ఆర్ట్స్ ఆఫీసులోనే ఉండి పని చేశాడు కూడా. ఒక దశలో శిరీష్-ప్రభాకర్ సినిమా ఓకే అయినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఐతే ఇప్పుడు ప్రభాకర్ కు ‘వి-4’ బేనర్లో అవకాశం ఇస్తున్నారు. ఈ సినిమాకు ఆదిని హీరోగా ఎంచుకోవడమూ ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రేమ కావాలి.. లవ్లీ లాంటి సినిమాలతో అతడి కెరీర్ ఓ మోస్తరుగానే ఆరంభమైనా.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయాడు ఆది. ఐతే అతడి ట్రాక్ రికార్డు చూడకుండా ఈ సినిమాలో అవకాశం కల్పించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/