Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ విడుదలకు ముందే నెట్టింట ట్రెండ్ అవుతున్న ప్రభాస్ 20

By:  Tupaki Desk   |   8 July 2020 12:10 PM GMT
ఫస్ట్ లుక్ విడుదలకు ముందే నెట్టింట ట్రెండ్ అవుతున్న ప్రభాస్ 20
X
పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు. 'జిల్' ఫేమ్ రాధా కృష్ణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందని.. దాదాపు 30శాతం పూర్తయిందని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా ఇదివరకే తెలిపాడు. ఇక ఈ సినిమా గురించి ఇంతవరకు ఎలాంటి సమాచారం.. అప్డేట్స్ లేకపోవడంతో డార్లింగ్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఇకనైనా ఏదైనా అప్డేట్ అందించాలని ఫ్యాన్స్ కోరారు.

ఇక ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి రెండు నెలలు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. కనీసం టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. అందుకే ప్రభాస్ అభిమానులు 'యూవీ క్రియేషన్స్' వారి పై మండిపడుతూ ఇటీవలే పెద్ద ఎత్తున ట్విట్టర్లో యుద్ధమే చేశారు. ఇక ఫ్యాన్స్ దెబ్బకి త్వరలోనే 'ప్రభాస్ 20' సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తామని యూవీ క్రియేషన్స్ వారు తెలిపారు. అయితే తాజాగా ఈరోజు ఉదయం యూవీ క్రియేషన్స్, ప్రభాస్ కలిసి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జులై 10న 10:10గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త తెలిసిన డార్లింగ్ అభిమానులలో జోష్.. ఉత్సాహం మాములుగా లేదు.

అప్పుడే సోషల్ మీడియా వేదికగా సందడి మొదలు పెట్టేసారు. డార్లింగ్ ప్రభాస్ 20 హాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ హాష్ ట్యాగ్ కి దేశవ్యాప్తంగా అభిమానుల నుండి అనూహ్యమైన స్పందన రావడం విశేషం. అయితే ప్రస్తుతం ప్రభాస్ 20 హాష్ ట్యాగ్ ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో ఉందని సమాచారం. ప్రభాస్ అభిమానులకు ఫస్ట్ లుక్ విషయం తెలిస్తే గాని జోష్ రాలేదు. కానీ జోష్ మొదలైతే ఏ రేంజ్ లో ఉంటుందో చూపిస్తాం అంటున్నారు. రాష్ట్రంలో షూటింగులకు అనుమతి వచ్చింది.. షూటింగ్ ప్రారంభిస్తామని హైదరాబాద్ లో భారీ సెట్ కూడా వేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించనుంది.