Begin typing your search above and press return to search.
రెండెకరాల్లో ప్రభాస్ 200కోట్ల ప్రాజెక్ట్?
By: Tupaki Desk | 8 Dec 2021 5:31 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు సినిమాల్ని ప్రారంభించి పూర్తి చేస్తున్నాడు. ఇందులో ఆదిపురుష్ 3డి టాకీ పూర్తయింది.
సలార్ మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఇంతలోనే నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె అనే సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రభాస్ ప్రారంభించాడు. ఇటీవలే దీపిక పదుకొనే ఈ సినిమా షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇక ప్రభాస్ ఒక్కో సినిమాకి వంద కోట్లు అందుకుంటూ సౌత్ క్రేజీ హీరోగా వెలిగిపోతున్నాడు. అటు బాలీవుడ్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని ఛరిష్మాని కొనసాగిస్తున్నాడు. డార్లింగ్ ప్రభాస్ పారితోషికం హిందీ సర్కిల్స్ లోనూ చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో భారీ ఆదాయ ఆర్జనను కలిగి ఉన్నాడు. అయితే అతడు ఈ డబ్బును ఏం చేస్తున్నాడు? అంటే.. రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. ఇప్పటికే ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రభాస్ సెర్చ్ లో ఉన్నారట.
అలాగే హైదరాబాద్ నానక్ రామ్ గూడలో రెండెకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తన అభిరుచికి తగ్గట్టుగా విలాసవంతమైన విల్లాను నిర్మించే యోచనలో ప్రభాస్ ఉన్నాడు.
ఆ స్థలంలో ప్రభాస్ భారీ మొత్తంలో ఖర్చు చేసి సకల సౌకర్యాలతో భారీ విల్లాను నిర్మించనున్నారని తెలిసింది. తాజా గుసగుస ప్రకారం... ఈ ల్యాంగ్ కొనుగోలు కోసమే ప్రభాస్ దాదాపు 120 కోట్ల వరకూ ఖర్చు చేసి ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఇందులో 200కోట్ల పెట్టుబడితో భారీ ఇంటిని నిర్మిస్తారన్న గుసగుసా వైరల్ అవుతోంది.
ఇండియాలోనే అత్యంత ఖరీదైన లంబోర్ఘిణి కార్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఇంటి నిర్మాణాన్ని అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్న టాక్ వేడెక్కిస్తోంది.
ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సంక్రాంతి బరిలో విడుదలవుతోంది. ఆదిపురుష్ 3డి చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం సలార్ ని పూర్తి చేస్తూనే ప్రాజెక్ట్ కెని కూడా వేగంగా పూర్తి చేసే ప్రణాళికల్లో ఉన్నాడు. 2022లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. కరోనా క్రైసిస్ భయాలు ఇప్పటికే తగ్గాయి. ఒమిక్రాన్ ప్రభావం అంతంత మాత్రమే. ఆ క్రమంలోనే ప్రభాస్ జెట్ స్పీడ్ తో ప్రతి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తున్నాడు.
సందీప్ వంగాతో స్పిరిట్ ..!
ఓవైపు మూడు సినిమాలు చేస్తూనే మరోవైపు వరుసగా దర్శకుల్ని ఫైనల్ చేస్తున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మరో భారీ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహకాలు సాగుతున్నాయి. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ మొదలైంది. కాస్టింగ్ సెలక్షన్స్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. స్పిరిట్ ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత భారీగా తెరకెక్కించి విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ మూవీ కోసం ప్రపంచ మార్కెట్ పై దృష్టి సారించడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. ఈ భారీ చిత్రాన్ని చైనీస్- కొరియన్ - జపనీస్ భాషలలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడం విశేషం. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఓ కొరియన్ స్టార్ ని ఎంపిక చేసారు. కొరియన్ మార్కెట్ చైనీస్ మార్కెట్ ని టార్గెట్ చేయాలంటే అక్కడ స్థానికంగా పాపులారిటీ ఉన్న ఒక కథానాయికను ఫైటర్లను ఎంపిక చేస్తున్నారని తెలిసింది.