Begin typing your search above and press return to search.
ప్రభాస్ 25 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
By: Tupaki Desk | 4 Sep 2021 10:33 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయినా కూడా కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. వచ్చే సంక్రాంతికి రాధేశ్యామ్ విడుదల అవ్వడం కన్ఫర్మ్ అయ్యింది. ఆ తర్వాత సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ రెండు కూడా సమాంతరంగా షూటింగ్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాదికి సలార్ మరియు ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ ముగించబోతున్నారు. మరో వైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది.
ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ నాలుగు సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా ప్రభాస్ పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడితో ప్రభాస్ సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అది కాకుండా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమాను కూడా ప్రభాస్ చేయబోతున్నాడు. ప్రభాస్ 25వ సినిమాగా దిల్ రాజు బ్యానర్ లో సినిమా ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ 25వ సినిమా కోసం దిల్ రాజు వృందావన అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించాడట.
ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు. ప్రభాస్ 25 గురించి పూర్తి క్లారిటీ లేదు. కాని ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో దద్దరిల్లేలా ప్రభాస్ 25 ను దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి చేసేందుకు కనీసం రెండేళ్ల సమయం అయినా ప్రభాస్ కు పడుతుంది. కనుక 2023 చివరి వరకు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
వృందావన అనే టైటిల్ చాలా విభిన్నంగా ఉంది. గతంలో దిల్ రాజు బృందావనం సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ మరియు దిల్ రాజుల కాంబోలో సినిమాలు గతంలో వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా అభిమానుల అంచనాలను అందుకునే విధంగా ఉంటాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.