Begin typing your search above and press return to search.
40 మంది హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను ఎవరైనా తేగలరా?
By: Tupaki Desk | 29 Aug 2019 1:33 PM GMTప్రభాస్ కథానాయకుడిగా నటించిన `సాహో` ఈ శుక్రవారం (ఆగస్టు 30న) రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇంకొన్ని గంటలే డార్టింగ్ డేకి కౌంట్ డౌన్.. ఇన్నాళ్ల ఊపరి సలపనివ్వని సస్పెన్స్ కి తెర వీడనుంది. బాహుబలి స్టార్ గా.. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ హవా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజులో ఉండనుంది? అన్నదానిపైనా తొలి వీకెండ్ నాటికి ఓ క్లారిటీ వచ్చేస్తుందనడంలో సందేహం లేదు.
సరిగ్గా రిలీజ్ ఒకట్రెండు రోజుల ముందు ప్రభాస్ తెలుగు మీడియా ఇంటరాక్షన్స్ లో రకరకాల ఆసక్తికర విషయాల్ని ఓపెన్ అవుతుండడం ఆసక్తి రేకెత్తించింది. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ఎలాంటి సాహసాలు చేశారో వివరించారు. సాహో కోసం ప్రతిదీ ప్లానింగ్ చాలా కొత్తగా చేశాం. వరల్డ్ కాస్ట్ లీ కార్లను.. బైక్ లను కొని తెచ్చి ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తీసేందుకు ఏకంగా 16 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అబూదబీ ఫ్లై ఓవర్ పై సీన్ కోసం ఏకంగా 80 కోట్లు పైగా ఖర్చయ్యిందని వెల్లడించారు.
ట్రక్ క్రాష్ అయ్యే సీన్ అయితే రిపీట్ చేయాల్సి వచ్చిందట. అది చేసేందుకు ముందు 40 మంది హాలీవుడ్ స్టంట్ మన్ లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిని వెతికి ఏరుకుని తీసుకొచ్చామని తెలిపారు. అలా ఎవరైనా తేగలరా? అని డార్లింగ్ రివర్స్ లో ప్రశ్నించడం ఆసక్తిని కలిగించింది. ఇక సాహో యాక్షన్ సీన్స్ కోసం 40 మందితో చిన్నసైజు ఫ్యాక్టరీ సెట్ చేశామని అనడం ఇంట్రెస్టింగ్. గాల్లో ఎగిరొచ్చి మీద పడుతున్న ఆ ట్రక్ సీన్ కోసం చాలా రిస్క్ నే చేశారట. అలాగే క్లైమాక్స్ యాక్షన్ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ గా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. హాలీవుడ్ నే తలదన్నే సినిమా తీశామన్న కాన్ఫిడెన్స్ ప్రభాస్ మాటల్లో వినిపించింది. మరి కొన్ని గంటల్లోనే తుపాకి డాట్ కాంలో `సాహో` రివ్యూ కోసం వేచి చూడండి.