Begin typing your search above and press return to search.
‘బాహుబలి’ రహస్యం తమన్నాకు తెలుసట
By: Tupaki Desk | 23 Oct 2016 11:30 AM GMTకట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఏడాది నుంచి ఇండియాలో ఎక్కడ చూసినా ఈ ప్రశ్న గురించే చర్చ. ఎవరు ఎంతగా అడిగినా రాజమౌళి ఈ రహస్యం బయటికి చెప్పట్లేదు. యూనిట్ సభ్యుల్లో కూడా ఈ రహస్యం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. వాళ్లు కూడా ఆ విషయాన్ని బయటికి చెప్పట్లేదు. ఐతే రాజమౌళి.. హీరోయిన్ తమన్నాకు సైతం ఈ రహస్యం చెప్పలేదట. కానీ ప్రభాస్ ఆమెకు ఈ ప్రశ్నకు జవాబు లీక్ చేసేశాడట. అది కూడా పిచ్చాపాటిగా మాట్లాడుతుండగా క్యాజువల్ గా ఆ విషయం చెప్పాడట ప్రభాస్. ఈ విషయాన్ని ‘బాహుబలి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో తమన్నా వెల్లడించింది.
‘‘బాహుబలి ఫస్ట్ పార్ట్ చేస్తున్నపుడు నాకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదు. ఐతే ఆ తర్వాత ప్రభాస్ సరదాగా మాట్లాడుతున్నపుడు చాలా క్యాజువల్ గా ఈ విషయం చెప్పాడు. నేను కూడా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ బాహుబలి విడుదలయ్యాక థియేటర్లో సినిమా చూసి వస్తుంటే అందరూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే చర్చించుకోవడం చూశాను. అందరిలోనూ అంత ఉత్కంఠ ఉంటే.. నాకు ఆ ప్రశ్నకు జవాబు తెలుసన్న సంగతి ఆశ్చర్యం కలిగించింది’’ అని తమన్నా చెప్పింది. తమన్నా ఇలా చెబుతుండగా కలుగజేసుకున్న ప్రముఖ విమర్శకుడు రాజీవ్ మసంద్.. దయచేసి ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలని.. ఈ ఆడిటోరియం దాటి విషయం బయటికి పోకుండా తాను చూసుకుంటానని అనడంతో తమన్నా.. రాజమౌళితో పాటు అందరూ గొల్లుమన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/