Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' టీజర్... ఎన్నో ఎన్నెన్నో ప్రచారాలు
By: Tupaki Desk | 21 Sep 2022 11:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక మోషన్ గ్రాఫిక్స్ మూవీ ఆదిపురుష్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం తెలుగు సౌత్ ఇండియన్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ హిందువులు ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటున్నారు. మొన్న ఆగస్టులో ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా వాయిదా పడింది.
సినిమా వాయిదా పడటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు ఓమ్ రౌత్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఈ దసరా నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు అయోధ్య లో పర్యటిస్తారని.. రామ్ లీలా మైదానంలో కూడా ఉత్సవాల్లో పాల్గొంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆదిపురుష్ యొక్క దసరా వేడుకల గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఎన్నో ఎన్నెన్నో ప్రచారాలు మాత్రం జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ ను దసరా సందర్భంగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ చేతుల మీదుగా అయోధ్యలో విడుదల చేయించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. యోగి ఆధిత్యనాధ్ ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
ఒక వైపు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతూ ఉంటే మరోవైపు ఇలా వందల కోట్లతో సినిమా నిర్మాణం అది కూడా రామాయణ ఇతివృత్తంతో తెరకెక్కడం అనేది యాదృశ్చికం అయినా కూడా ఒక అద్భుతం అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కనుక యోగి ఆధిత్యనాథ్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
దసరాకి సినిమా విడుదల అయితే ఇక సినిమా విడుదల అయ్యే వరకు రచ్చ రచ్చ గా ప్రమోషన్ కార్యక్రమాలను ఆదిపురుష్ యూనిట్ సభ్యులు చేసే అవకాశం ఉంది. రాముడిగా ప్రభాస్ కనిపించబోతుండగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ సీత పాత్రలో కృతి సనన్ ను వెండి తెరపై చూడబోతున్నాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.